పూరీ బయటి వాళ్లతోనే ఎందుకు? ఛాన్సులు లేకనే ఛీప్ విమర్శలు | Actress Hema Comments on Director Puri.

Actress hema comments on puri jagannath

Hema, Actress Hema, Hema Puri Jagannadh, Puri Jagannadh Hema, Hema NTR Mother's Role, Hema on Media, Actress Hema Cast Couching, Hema Tollywood

Tollywood Characteristic artist Hema fire on top directors, especially on Puri Jagannadh. Also Says comments on heroines who made statement on cast couching.

దర్శకుడు పూరీపై నటి హేమ వ్యాఖ్యలు

Posted: 03/18/2017 03:21 PM IST
Actress hema comments on puri jagannath

చిన్న వయసులోనే టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి దాదాపు 25 ఏళ్ల సినీ కెరీర్ ను పూర్తి చేసుకుంది నటి హేమ. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) కార్యకలాపాల్లో కూడా చురుకుగా ఉంటున్న హేమ ప్రస్తుతం కూడా స్టార్ల సినిమాలతో బిజీగా ఉంది. కెరీర్ తొలినాళ్లలో చిన్న చితకా పాత్రలు వేసినప్పటికీ నువ్వు నాకు నచ్చావ్ సినిమా తనకు టర్నింగ్ పాయింట్ అయ్యిందని లేటెస్ట్ గా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకుంది. అయితే ప్రస్తుతం తనకు తగ్గ పాత్రలు పడటం లేదన్న ఆమె ఒక దశలో స్టార్ దర్శకులపై విరుచుకుపడింది.

ముఖ్యంగా టాప్ డైరక్టర్ పూరీ జగన్నాథ్ ను ఉద్దేశించి నేరుగానే ఆమె విమర్శలు గుప్పించింది. తెలుగు వారికి ప్రస్తుతం తెలుగులో తక్కువ అవకాశాలు ఉంటున్నాయన్న ఆమె పూరీ లాంటి వాళ్లైతే ఎక్కడి నుంచో ఆర్టిస్ట్ లను తెచ్చి తెలుగువాళ్ల పొట్ట కొడుతున్నాడు అన్న చందాన కామెంట్ చేసింది. అసలు తన సినిమాల్లో పూరీ తల్లి పాత్రలు ఎందుకు ఇవ్వడంటూ ఆమె ప్రశ్నించింది. ఎంతో సీనియరిటీ ఉన్న తన లాంటి వాళ్లు ఎన్టీఆర్ కు తల్లిగా నటించే స్థాయి తనకు లేదా? అని నిలదీసింది.

ఇంకోవైపు హీరోయిన్లపై మీడియా కథనాలపై ఆమె విరుచుకుపడ్డ విషయం తెలిసిందే. అయితే కొందరు క్యాస్టింగ్ కౌచ్ సంస్కృతి ఈ మధ్య మాట్లాడుతున్న హీరోయిన్లు అవకాశావాదులంటూ మండిపడింది. అసలు ఈ ఆరోపణలు చేస్తున్న వాళ్లంతా గతంలోని సినిమాల పేర్లు చెప్పుకుని ఇప్పటికీ బతుకుతున్నారని చెప్పింది. కాంట్రవర్సీలతో వార్తల్లో నిలిచి ఇప్పుడు మళ్లీ అవకాశాలు కొట్టేయాలని ఫ్లానులు వేస్తున్నారంటూ తెలిపింది. ఇండస్ట్రీ మంచిది కాకపోతే టాప్ హీరోలు, మేకర్లు వాళ్ల పిల్లలను ఎందుకు ఇక్కడికి రానీస్తారంటూ గట్టిగానే క్వశ్చన్ చేసింది హేమ.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Actress Hema  Tollywood Directors  Puri Jagannath  

Other Articles

Today on Telugu Wishesh