బాహుబలి-2 మరో రెండు.. ఒకటి గ్రాండ్.. మరోకటి సింపుల్ | Baahubali 2 audio only two languages.

Baahubali 2 telugu and tamil audio dates fixed

Baahubali-2, Baahubali The Conclusion, Baahubali 2 Audio Launch, Baahubali 2 telugu audio, Baahubali 2 Tamil Audio Launch, Baahubali 2 Grand Events

Baahubali-2 Audio Launch Dates and Venue Fixed.

బాహుబలి-2 ఆడియో వేడుకలకు అంతా సిద్ధం

Posted: 03/18/2017 01:42 PM IST
Baahubali 2 telugu and tamil audio dates fixed

సరైన సమయంలో ట్రైలర్ రిలీజ్ కావటం బాహుబలికి బాగా కలిసొచ్చిందనే చెప్పుకోవాలి. జియో పుణ్యమానో లేక కట్టప్ప కారణంగానో పార్ట్ 2 పై అంచనాలు పెంచేసుకుని ట్రైలర్ కోసం ఎగబడిపోవటంతో రికార్డులు బద్ధలు అయ్యాయి. నెల ముందు నుంచి ట్రైలర్ హవా కొనసాగుతుండగానే మరో రెండు గ్రాండ్ ఈవెంట్లకు బాహుబలి టీం సిద్ధమైపోతుంది.

ఇక మిగిలింది ఆడియో వేడుకలే. మిగతా భాషల సంగతి పక్కన పెట్టి ప్రస్తుతానికైతే తెలుగు, తమిళ భాషల్లో ఆడియో రిలీజ్ చేసేందుకు సర్వం సిద్ధం చేసేస్తున్నారు. ఈ నెల 26న రామోజీ ఫిల్మ్ సిటీలో గ్రాండ్ గా ఆడియో జరగబోతుంది. ఓపెన్ ఇన్విటేషన్ కావటంతో వచ్చే అతిథులను దృష్టిలో పెట్టుకుని ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా గట్టి భద్రత చర్యలే తీసుకుంటున్నారంట.

మరోవైపు కోలీవుడ్ లో ఈ చిత్ర ఆడియోను మాత్రం పెద్దగా హడావుడి లేకుండానే కానిచ్చేయాలని డిసైడ్ అయిపోయారు. ఏప్రిల్ 9న ఓ ఇండోర్ స్టేడియంలో కొద్దిమంది స్టార్లు, మీడియా సమక్షంలో దీనిని నిర్వహించనున్నారు. ఆపై మిగతా భాషల్లో ప్రభాస్, రానాలతో కలిసి ప్రమోషన్లను వేగవంతం చేసే ఆలోచనలో ఉన్నాడు జక్కన్న.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Baahubali The Conclusion  Telugu and Tamil Audio  

Other Articles

Today on Telugu Wishesh