జయసుధ భర్త మరణం.. అసలు కారణం అదేనంట! | Reaso behind Nitin Kapoor's Suicide.

Nitin kapoor committee suicide with depression

Actress Jayasudha, Jayasudha, Jayasudha's Husband, Nitin Kapoor Death, Jitendra's Cousin Suicide, Jeetendra's Cousin Nitin Kapoor, Jayasudha Husband Suicide, Jayasudha Husband Death, Nitin Kapoor Depression, Financial Troubles Jayasudha, Jayasudha Family, Jayasudha Husband Old Photos, Jayasudha Nitin Kapoor Relation

Senior Actress Jayasudha's Husband Nitin Kapoor Commits Suicide in Depression.

డిప్రెషన్ తోనే నితిన్ కపూర్ ఆత్మహత్య

Posted: 03/15/2017 10:53 AM IST
Nitin kapoor committee suicide with depression

సహజ నటి జయసుధ భర్త నితిన్ కపూర్ ముంబై లోని ఓ అపార్ట్ మెంట్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న ఉదంతం పెద్ద షాకే ఇచ్చింది. పంజాబీ నిర్మాతగా పలు చిత్రాలను తీసిన ఆయన త్వరలో ఓ తెలుగు సినిమాకు ప్రయత్నాలు చేస్తున్న క్రమంలోనే కారణాలేవో తెలీకుండా ఇలా విగతజీవిగా మారటం పలు అనుమానాలకు తావిచ్చింది.

అయితే ఆయన మరణం వెనుక ఆర్థిక వ్యవహారాలు ఎంత మాత్రం కారణం కాదని మోహన్ బాబు లాంటి వాళ్లు చెబుతుండగా, ఆయన గత కొంతకాలంగా డిప్రెషన్ తో బాధపడుతున్నాడని కుటుంబ సభ్యులు స్పష్టం చేశారు. ప్రస్తుతం కోకిలాబెన్ హాస్పిటల్‌లో ట్రీట్‌మెంట్ కూడా తీసుకుంటున్నాడని తెలుస్తోంది. గతంలో కూడా ఆయన ఇలాగే ఓసారి సూసైడ్ కి యత్నించాడని తెలుస్తోంది. చాన్నాళ్ల క్రితం ఆయన తీసిన సినిమాలు అట్టర్ ఫ్లాప్ కావటంతో ఆత్మహత్య యత్నం చేశాడు కూడా.

ఆపై జయసుధ ఎలాగోలా ఆ నష్టాన్ని భర్తీ చేసినప్పటికీ, ఆయనింకా అదే విషయాన్ని పదే పదే గుర్తు చేసుకంటూ కుంగిపోయే వాడని, ఈ క్రమంలోనే ముంబైలోని అంధేరీ వెస్ట్ జేపీ రోడ్‌లో ఉన్న సీ గ్లింప్స్ భవన సముదాయంలోని సోదరి ఇంట్లో ఉంటున్న నితిన్ కపూర్ మంగళవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడని తెలుస్తోంది. గతంలో ఓసారి కారు ప్రమాదం నుంచి కూడా ఆయన భయపడ్డాడు కూడా.

క్రికెట్ కలిపింది ఇద్దరినీ...

జయసుధ అసలు పేరు సుజాత.  అప్పటికే ఓ సుజాత ఉండటంతో క్లాసిక్ దర్శకుడు ఆమె పేరును జయసుధగా మార్చేశాడు. నాదెండ్ల భాస్కర్ రావు బంధువైన రాజేంద్ర ప్రసాద్ ను పెళ్లి చేసుకుని ఆపై విడాకులు కూడా తీసుకుంది ఆమె. తర్వాత 1985 లో నితిన్ కపూర్ తో మళ్లీ వివాహం అయ్యింది. పంజాబీ నిర్మాత అయిన నితిన్ బాలీవుడ్ లెజెండరీ హీరో జితేంద్రకు దగ్గరి బంధువు. దాసరి జితేంద్ర తో సినిమా తీయటం, నితిన్ తరచూ ఆ షూటింగ్ లకు వస్తుండేవాడు. ఈ క్రమంలో వీరిద్దరి పరిచయం ఏర్పడటం. ఇద్దరికి క్రికెట్ పేవరట్ కావటం, అభిరుచులు కలవటంతో ప్రేమ చివరికి పెళ్లి అలా చకచకా జరిగిపోయాయి.

Jayasudha remembers Husband

వీరిద్దరికీ నిహార్, శ్రేయన్ అనే ఇద్దరు కుమారులు. గతంలో నితిన్ కు ఆర్థిక కష్టాలు వచ్చిన సమయంలో జయసుధ ఎంతో అండగా ఉండేది. అయినా మనోధైర్యం చాలక ఇలా నితిన్ ఆత్మహత్యకు పాల్పడటం దిగ్భ్రాంతికి గురి చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jayasudha Husband  Nitin Kapoor  Suicide  

Other Articles