శ్రీదేవి ఛాలెంజ్ చేస్తే ఇలా ఉంటుందా? | Sridevi looks intense and intriguing in her 300th film.

Sridevi unveils the first look of mom

Actress Sridevi, Sridevi Mom Movie, Mom First Look, Srdevi Mom Movie, Mom Movie Actress, Sridevi 300 th Movie, Sridevi Triple Century Movie

Sridevi's Mom Movie First Look Released.

శ్రీదేవి మామ్ ఫస్ట్ లుక్ రిలీజ్

Posted: 03/14/2017 10:23 AM IST
Sridevi unveils the first look of mom

దాదాపు రెండు దశాబ్దాల తర్వాత గౌరీ షిండే ఇంగ్లీష్ వింగ్లీష్ తో ప్రేక్షకుల ముందుకు ఇచ్చిన శ్రీదేవి రీఎంట్రీలో అదరగొట్టేసింది. అయితే ఆ తర్వాత కోలీవుడ్ లో చేసిన పులి ఏ మాత్రం ప్రభావం చూపలేకపోకపోగా, పైగా అతిలోక సుందరి అతి చేసిందంటూ విమర్శలు వచ్చి పడ్డాయి. దీంతో ఇక నుంచి సెలక్టివ్ రోల్స్ మాత్రమే డిసైడ్ అయ్యింది.

ఈ క్రమంలో తన తర్వాతి చిత్రం ‘మామ్’ తో త్వరలో ముందుకు రాబోతుంది. ఈ చిత్ర ఫస్ట్ లుక్ ఈరోజే రిలీజ్ అయ్యింది. ఓ బ్లాక్ కలర్ బ్యాగ్రౌండ్ లో సీరియస్ గా చూస్తున్న శ్రీదేవి పోస్టర్ ను వదిలాడు. దానిపై పలు భాషల్లో మామ్ అనే మీనింగ్ వచ్చేలా అక్షరాలు పేర్చారు. ఇక మామ్ మధ్యలో ఓ అక్షరాన్ని రెడ్ కలర్ లో చూపించడాన్ని బట్టి కూతురి కోసం ఓ తల్లి తీర్చుకునే రివెంజ్ కాన్సెప్ట్ ఆధారంగా ఇది రూపొందబోతుందని అర్థమౌతోంది. 

బోనీ కపూర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి రవి ఉదయవార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం హిందీ, తెలుగు, తమిళ్ భాషల్లో జూలై 14న విడుదల కానుంది. ఇందులో నవాజుద్దీన సిద్దిఖి, అక్షయ్‌ ఖన్నా కూడా కీలక పాత్రలు చేస్తున్నారు. శ్రీదేవి భర్త పాత్ర చేస్తున్న అద్నాన సిద్దిఖి, కూతురి రోల్ లో సజల్‌ అలీ ఇద్దరూ పాక్ చెందిన నటులే లీడ్ రోల్స్ లో కనిపించబోతున్నారు. పైగా ఇది శ్రీదేవి 300వ చిత్రం కావటం విశేషం.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Actress Sridevi  Mom Movie  First Look  

Other Articles