రేవతి మాజీ భర్త మరణం.. చిన్న మిస్టెక్ | Revathi's Ec Husband not Dead.

Revathi ex husband suresh menon death hoax

Senior Actress Revathi, Revathi Suresh Menon, Suresh menon Death, Revathi Ex Husband Death Hoax, Suresh Menon Death Hoax, Suresh Chandra Menon

Senior Actress Revathi's ex-husband Suresh Menon death hoax. Later clarifies ace director is not dead. The rumours of Suresh Menon's death started doing rounds online on Monday and many people even paid condolences on Twitter.

చనిపోయింది రేవతి మాజీ భర్త కాదు

Posted: 03/14/2017 11:01 AM IST
Revathi ex husband suresh menon death hoax

టాలీవుడ్ తోపాటు సౌత్ లో, బాలీవుడ్ లో కూడా కొన్ని సినిమాలు చేసిన నటి రేవతి గురించి నిన్నంతా ఓ వార్త హల్ చల్ చేసింది. ప్రముఖ దర్శకుడు, ఆమె మాజీ భర్త సురేష్ మీనన్ చనిపోయారని కొన్ని మీడియాలో ప్రముఖంగా ప్రసారం కావటం పెద్ద చర్చకే దారితీసింది. దీంతో సానుభూతి తెలుపుతూ రేవతికి సందేశాలు అందాయంట. అయితే చనిపోయింది ఆయన కాదని తర్వాత తెలిసింది.

మళయాళ యువ దర్శకుడు దీపన్ చేతన్ సోమవారం అనారోగ్యంతో చనిపోయిన విషయం తెలిసిందే. ఆయన పృథ్వీరాజ్ హీరోగా పుతియా ముఖం అనే సినిమాను తెరకెక్కించాడు. అందులో రేవతి మాజీ భర్త అయిన సురేష్ నటించాడు కూడా. అయితే ఆ చిత్ర దర్శకుడు చనిపోయాడన్న వార్త వెలువడగానే పొరపాటున సురేష్ కూడా దర్శకుడు కావటంతో చనిపోయింది ఆయనేనంటూ మీడియా కథనాలు వెలువడ్డాయి.

అయితే చనిపోయింది ఆయన కాదంటూ నటుడు మోహన్ రామన్ ట్విట్టర్ లో క్లారిటీ ఇచ్చాడు. కొన్ని చిత్రాలకు దర్శకుడిగా వ్యవహరించి, ఆపై నటుడిగా మారిన సురేష్ చంద్ర మీనన్ 1986 లో నటి రేవతిని వివాహం చేసుకుని 2013 లో విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతం ఆయన తార్నా సెర్థ్నా కూథమ్ లో నటిస్తుండగా, కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ఆ చిత్రంలో ఓ ప్రధాన పాత్రలో కనిపించబోతున్నాడు. మరోపక్క అమలాపాల్ తో క్వీన్ రీమేక్ డైరక్ట్ చేసే పనిలో రేవతి ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Actor Suresh Menon  Death Hoax  Revathi Clarify  

Other Articles

Today on Telugu Wishesh