క్రిష్ నెక్ట్స్ ప్రాజెక్టు ఎవరితోనో తెలుసా.? krishh next project with nandamuri hero

Krishh next project with nandamuri hero

krish to direct kalyanram, Kalyan ram, Krish, Ntr, Bala Krishna, victory venkatesh, tollywood, gautami putra satakarni, balakrishna, telugu movie news

Director Krish who planned to collaborate with Victory Venkatesh but there has not been any official confirmation, asked about his next project, he replied that his directorial venture with Kalyanram would be started from May

క్రిష్ నెక్ట్స్ ప్రాజెక్టు ఎవరితోనో తెలుసా.?

Posted: 03/12/2017 10:57 AM IST
Krishh next project with nandamuri hero

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ గా అనతికాలంలోనే పేరు తెచ్చుకోవడంతో పాటు జాతీయ అవార్డును కూడా సొంతం చేసుకున్న డైరెక్టర్ క్రిష్ గౌతమీపుత్ర శాతకర్ణి చిత్రం తరువాత.. విక్టరీ వెంకటేష్ తో కలసి ప్రాజెక్టు చేస్తున్నారని వార్తలు వచ్చాయి. అది కూడా చారిత్రక నేపథ్యమున్న చిత్రమనే టాక్ కూడా వినిపించింది. అయితే దానిపై అధికారికంగా ఎలాంటి సమాచారం కూడా వెలువడలేదు. ఇదిలావుంటే క్రిష్ విక్టరీకి హ్యాండ్ ఇచ్చి.. నందమూరి ఫ్యామిలీకే అట్రాక్టు అయ్యినట్టు వున్నాడు.

నందమూరి వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన యంగ్ హీరో కళ్యాణ్ రామ్ తో తన తదుపరి ప్రాజెక్టును చేపట్టనున్నారు. ఇటీవల పటాస్ సినిమాతో తిరిగి ఫాంలోకి వచ్చినట్టుగా కనిపించిన కళ్యాణ్ రామ్.. షేర్, ఇజం సినిమాలతో మరోసారి నిరాశపరిచాడు. కాగా, క్రిష్ ఈ మధ్య కళ్యాణ్ రామ్కు ఓ కథ చెప్పాడన్ని ప్రచారం జరుగుతోంది. బాలకృష్ణ తాజా చిత్రం ప్రారంభోత్సవానికి హాజరైన క్రిష్ ను ఈ విషయం అడుగగా, కల్యాన్ రామ్ తో తన తదుపరి ప్రాజెక్టు చేస్తున్నానని చెప్పాడు. మరో రెండు నెలల్లో తమ ప్రాజెక్టు ప్రారంభమవుతుందని కూడా చెప్పాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles