ఒక్క మళయాళంకే కాదు, యావత్ సౌతిండియాలో మోహన్ లాల్ ఓ స్టార్ హీరో. అప్పటికే మాలీవుడ్ లో సీనియర్ హీరోగా చెలామణి అవుతున్న ఈ కంప్లీట్ యాక్టర్ ఈ మధ్య వరుసగా తెలుగు, తమిళ్ సినిమాల్లో కూడా సక్సెస్ లు చవిచూస్తున్నాడు. అలాంటి సీనియర్ హీరోపై సంచలన కామెంట్లు చేసినందుకు ఓ యువకుడు ఊచలు లెక్కించాల్సిన పరిస్థితి ఏర్పడింది. వీడియో కోసం క్లిక్ చేయండి
మోహన్ లాల్ తోపాటు ఆయన సన్నిహితుడు, నిర్మాత అయిన ఆంటోనీ పెరుంబవూర్ లు సెక్స్ రాకెట్ నడుపుతున్నాడంటూ త్రిస్సూర్ కు చెందిన నషి అష్రాఫ్ అనే యువకుడు ఓ సెల్ఫీ వీడియో తీసి తన ఫేస్ బుక్ లో పోస్ట్ చేశాడు. అయితే గతంలోనే ఆ యువకుడు ఈ కంప్లీట్ యాక్టర్ పై ఈ రకంగానే విమర్శలు చేశాడు కూడా. తాజా కామెంట్లపై సీరియస్ అయిన ఆంటోనీ పోలీస్ కంప్లైంట్ చేయటంతో నశిష్ ను అరెస్ట్ చేశారు. ఇదే కాదు ఈ మధ్య ఈ స్టార్ హీరో తరచూ వివాదాలు చిక్కుకుంటున్నాడు. కొంత కాలం క్రితం ఆయన ఓ ఆయుర్వేద థెరపీ ప్రారంభించగా, అందులో అవకతవకలు జరిగాయంటూ కొందరు తీవ్ర విమర్శలు చేశారు.
ఆ సంగతి పక్కనపెడితే పులి మురుగున్ తో మాలీవుడ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ చవిచూసిన మోహన్ లాల్ రెండు చిత్రాలతో ఈ యేడాది ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. అందులో ఒకటి ‘విలన్’ కాగా, మరోకటి అల్లు శిరీష్ ఓ పాత్రలో కనిపించబోతున్న 1971, బీయాండ్ బార్డర్స్ సినిమా. విలన్ ఫస్ట్ లుక్ ఇప్పటికే రిలీజ్ అయి అక్కడ సెన్సేషన్ గా మారింది కూడా.
(And get your daily news straight to your inbox)
May 17 | విశ్వనటుడు కమల్ హాసన్ విశ్వరూపం చిత్రం తరువాత ఇప్పటి వరకు ఏ సినిమా రాలేదు. ఆయన రాజకీయ అరంగ్రేటం చేయడంతో సినిమాలకు తాత్కాలికంగా పక్కన బెట్టారు. నుంచి సినిమా వచ్చి దాదాపు నాలుగేళ్ళు దాటింది.... Read more
May 16 | యంగ్ హీరో విజయ్ దేవరకొండ నుంచి సినిమా వచ్చి దాదాపు రెండేళ్ళు దాటింది. ప్రస్తుతం ఈయన నటించిన లైగర్ విడుదలకు సిద్ధంగా ఉంది. పూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్టు 25న ప్రేక్షకుల... Read more
May 16 | టాలీవుడ్ చిత్రపరిశ్రమలో ఎప్పుడో రెండు దశాబ్దాల క్రితం వచ్చిన కామెడీ సీక్వెల్ ఇన్నాళ్లకు మళ్లీ అనీల్ రావిపూడి పుణ్యమా అని రూపోందుతోంది. అప్పట్లో శివ నాగేశ్వర రావు తీసిన మనీ.. మనీ మనీ.. చిత్రాలు... Read more
May 09 | టాలీవుడ్ డాన్సింగ్ క్వీన్ సాయి పల్లవి. తన నటనతో... డాన్సింగ్తో సినీ ప్రేక్షకుల మనసు గెలుచుకుంది. 2017లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘ఫిదా’ చిత్రంతో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అమె.. భానుమతి పాత్రలో,... Read more
May 09 | టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ నటించిన అశోకవనంలో అర్జున కళ్యాణం చిత్రంలో క్లాస్‌గా కనిపించాడు. ఇన్నాళ్లు యూత్ ను మాత్రమే ఆకర్షించిన ఆయన తొలిసారి మాస్ ఆడియన్స్ కు చేరువయ్యేలా వైవిద్యమైన చిత్రాన్ని... Read more