యాంకర్లు రవి, లాస్యలను ఎంత దారుణంగా ఎస్కుందో చూడండి | Nurse Association fire on Ravi, Srimukhi.

Controversy skilt patas anchors in trouble

Anchors Ravi and Srimukhi, Patas Anchors, Patas Anchors Police Case, Patas Programme Controversy, Anchor Ravi and Srimukhi, Nurse Association Patas Programme, Nurse Ravi Srimukhi, Patas Police Case, Anchors insult Nurses, avi Srimukhi, Telugu Anchors Police Case

Nurse Association Filed a case against Anchors Ravi, Srimukhi on patas program for insulting them.

యాంకర్ రవి, శ్రీముఖిలపై పోలీస్ కేసు

Posted: 03/08/2017 03:01 PM IST
Controversy skilt patas anchors in trouble

రియాలిటీ షోల పేరిట టీఆర్పీల కోసం చేస్తున్న యత్నాలు తీవ్ర స్థాయిలో వివాదాలను రాజేస్తున్నాయి. వెకిలి చేష్టలతో ఒక్కోసారి మనోభావాలను దెబ్బతీయటం, ఆపై తాపీగా తిట్లు తినటం పరిపాటిగా మారిపోయింది. ఇది వరకు న్యాయవాదులను, కొందరు కులస్థులను అవమానించారంటూ జబర్దస్త్ పై కోర్టు గుమ్మం దాకా వెళ్లిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు మరో కార్యక్రమంలో ఇలాంటి సీనే రిపీట్ అయ్యింది. ఓ ఎంటర్ టైన్ ప్రోగ్రాంలో యాంకర్లుగా ఉన్న రవి, శ్రీముఖిలపై ఏకంగా పోలీస్ కేసు నమోదయ్యింది.

ఈ నెల 4న సదరు కార్యక్రమంలో ఓ స్కిట్ లో తమను ఘోరంగా అవమానించారంటూ తెలంగాణ నర్సింగ్ అసోషియేషన్ మండిపడింది. నర్సులను కించపరిచేలా వ్యాఖ్యానించారని పేర్కొంటూ ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ లో అసోసియేషన్ ఫిర్యాదు కూడా చేసింది. ఈ సందర్భంగా సంఘం ప్రధాన కార్యదర్శి సుష్మిత రవి, శ్రీముఖిలపై విరుచుకుపడింది. వీరిద్దరూ కంటపడితే చెప్పులతో కొడతారంటూ వ్యాఖ్యానించింది.

 

‘‘మీరు ఎప్పుడూ ఆసుపత్రికి వెళ్లలేదా?, మీ కుటుంబ సభ్యులకు ఆసుపత్రిలో నర్సులతో చికిత్స చేయించుకోలేదా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. తామెంతో పవిత్రంగా భావించే వృత్తిని అవమానపరిచారంటూ పేర్కొంది. ఆసుపత్రికి వచ్చే ప్రతి రోగికి, తాము ఎంతో సేవ చేస్తామని... అలాంటి తమను అవహేళన చేస్తే చూస్తూ ఊరుకోబోమని తెలిపింది. తక్షణమే రవి, శ్రీముఖిలు తమకు బహిరంగ క్షమాపణ చెప్పాలని సంఘం తరపున ఆమె డిమాండ్ చేసింది. మరి దీనిపై ఎలాంటి రియాక్షన్ ఉంటుందో చూడాలి మరి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Patas Programme  Anchors Srimukhi and Ravi  Controversy  Police Case  

Other Articles

Today on Telugu Wishesh