అఖిల్ షాక్ నుంచి కొలుకునే పనిలో పడ్డాడు. ఏం చేస్తున్నాడంటే... | Nagarjuna back to Raju Gari Gadhi shooting.

Nag look out from raju gari gadhi 2

Akkineni Nagarjuna, Nagarjuna Raju Gari Gadhi 2, Raju Gari Gadhi 2 Nag Look, Nag Look Out, Nagarjuna Raju Gari Gadhi 2 Look, Raju Gari Gadhi-2 Movie,

Akkineni Nagarjuna reveals his look in Raju Gari Gadhi 2.

రాజుగారి గది-2 నాగ్ లుక్కు అవుట్

Posted: 03/06/2017 04:05 PM IST
Nag look out from raju gari gadhi 2

అక్కినేని నాగార్జున కుటుంబలో అఖిల్ పెళ్లి రద్దు కాస్త అల్లకల్లోలాన్నే రేపిందన్నది అర్థమౌతూనే ఉంది. చెర్రీ వైఫ్ ఉపాసనతోసహా చాలా మంది సెలబ్రిటీలు శ్రేయా అఖిల్ మధ్య రాజీ కుదర్చటానికి ప్రయత్నిస్తున్నప్పటికీ, అది వర్కవుట్ కావట్లేదని తెలుస్తోంది. అయితే ఎప్పుడూ జోవియల్ గా కనిపించే నాగ్ ఈ దెబ్బకి డిప్రెషన్ లోకి వెళ్లటం, ఫోన్ నంబర్ మార్చి ఇంటికే పరిమితం కావటం, వైఫ్ అమల మీడియా కంటపడి కూడా తప్పించుకుని తిరగటం లాంటివి చూస్తూనే ఉన్నాం. అయినా ఆ ప్రభావం తన నెక్ట్స్ సినిమాపై పడొద్దన్న డెసిషన్ కి వచ్చాడు నాగ్.

అందుకే ఆ టాపిక్ నుంచి డైవర్ట్ అయ్యేందుకు తన నెక్ట్స్ మూవీ రాజుగారి గది -2 షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ఇందుకు సంబంధించి నాగ్ లుక్ రివీల్ అయ్యింది కూడా. మెడలో, చేతిలో బ్రాండ్ లతో సీరియస్ గా చూస్తూ ఉన్న ఫోటో ను తన ట్విట్టర్ లో ఉంచాడు నాగ్. అంతేనా కాస్త రీఫ్రెష్ అయ్యి మళ్లీ బిజినెస్ లోకి అడుగు పెట్టానంటూ మీనింగ్ వచ్చేలా ఓ మెసేజ్ కూడా ఉంచాడు.

 

మొత్తానికి ఏదైతేనేం పర్సనల్ వ్యవహారాల నుంచి ప్రోఫెషనల్ లోకి మారిపోయిన నాగ్ మళ్లీ హ్యాపీ అయ్యాడు అది చాలు. యాంకర్ కమ్ డైరక్టర్ ఓంకార్ అన్నయ్య దర్శకత్వం వహిస్తున్న హర్రర్ కామెడీ థ్రిల్లర్ లో నాగ్ ఓ మైండ్ రీడర్ పాత్రలో నటిస్తుండగా, సీరత్ కపూర్ హీరోయిన్ గా, సమంత ఓ కీ రోల్ లో కనిపించబోతుంది.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Raju Gari Gadhi-2  Akkineni Nagarjuna look  

Other Articles

Today on Telugu Wishesh