విజయ్ రెండో పెళ్లి.. వాళ్ల పనేనంట! అమలను మరిచిపోలేకపోతున్నాడా? | Director AL Vijay denies reports on remarriage.

Director vijay on re marriage

AL Vijay Amala Paul, AL Vijay Re Marriage, Director AL Vijay Second Marriage, Amala Paul Second Marriage, Amala Paul Re Marriage, Vijay Re Marriage Rumour, Amala Paul Ex Husband Re Marriage, Divorcee Director Re Marrige, South Top Director RE Marrige, Director Second Marriage

Director AL Vijay and Actress Amala Paul have been the talk of the town ever since they decided to separate. Now the Divorcee Director denied reports that he is set to marry again.

పెళ్లి వార్తను ఖండించిన అమల మాజీ భర్త

Posted: 03/04/2017 08:01 AM IST
Director vijay on re marriage

తమిళ టాప్ డైరక్టర్ ఏఎల్ విజయ్ నటి అమల పాల్ తో ఇలా అఫీషియల్ గా విడాకులు తీసుకున్నాడో లేదో.. అలా మరో వివాహానికి సిద్ధమైపోయాడని వార్త ఒకటి చక్కర్లు కొడుతోంది. ఇక విషయం తెలియగానే షూటింగ్ స్పాట్ లోనే అప్ సెట్ కు గురైన అమల డల్ గా ఉందంటూ కహానీలు పుట్టుకొచ్చాయి. అయితే రెండో పెళ్లిపై కేవలం మీడియాలోనేనా? విజయ్ కూడా స్పందిస్తాడా? అని అభిమానులంతా ఎదురు చూస్తుండగానే మరో వార్త వచ్చింది.

సోషల్ మీడియాలో గత కొంత కాలంగా వస్తున్నవన్నీ పుకార్లే నని విజయ్ అఫీషియల్ గానే స్పదించాడు. వాస్తవానికి తనకు రెండో పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని స్పష్టం చేశాడు. కొన్ని వార్తాపత్రికలు తన పెళ్లి గురించి కల్పిత కథలు రాశాయని తెలిపాడు. అవి నిరాధారమైనవని స్పష్టం చేశాడు. వాస్తవాలు నిర్ధారించుకోకుండా వెలువడ్డ ఆ వార్తలు తనను బాధించాయని ఆవేదన వ్యక్తం చేశాడు.

తన ఎదుగుదలలో మీడియా కీలక పాత్ర పోషించిందని చెప్పిన విజయ్, తనపై ఇలాంటి పుకార్లు రాయవద్దని స్పష్టం చేసే నైతికహక్కు తనకు ఉందని ఆయన అన్నాడు. ప్రస్తుతం తాను ప్రేక్షకులను అలరించే సినిమాలు తీయడంపైనే పని చేస్తున్నానని, దానికి అంతా సహకరించాలని కోరాడు. ఇక ఆర్యతో ఓ ఫారెస్ట్ థ్రిల్లర్ సినిమా ను తెరకెక్కిస్తున్న విజయ్ ఆ ప్రాజెక్టులో బిజీగా ఉన్నాడంట. మరి ఇప్పుడు అమల ఎలా స్పందిస్తుందో అన్నదానిపై ఆసక్తి క్రియేట్ అయ్యింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Director AL Vijay  Amala Paul  Re Marriage  

Other Articles