పిల్లల వల్లే గొడవలు జరుగుతున్నాయా? | Namrata about Mahesh love on Children.

Namrata opinion on mahesh babu

Namrata Latest Interview, Namrata Mahesh Clash, Actress Namrata Shirodkar, Namrata Shirodkar About mahesh, Mahesh Babu Kids, Namrata Mahesh Weakness, Mahesh Babu Wife Interview, Namrata Mahesh 12 Years, Mahesh Babu Family

Actress Namrata Shirodkar about husband Mahesh Babu says he is great son and also good father.

మహేష్ గురించి నమ్రత ఒపినీయన్ ఏంటంటే...

Posted: 03/01/2017 11:36 AM IST
Namrata opinion on mahesh babu

ఫెమినా మిస్ ఇండియా, అటు నుంచి బాలీవుడ్ నటిగా ప్రమోట్ అయ్యింది నమ్రతా శిరోద్కర్. మహేష్ తో చేసింది ఒక్క సినిమానే అయినా పీకల లోతు ప్రేమలో ముంచేసింది. ఏజ్ గ్యాప్ ఉన్నప్పటికీ పెద్దల అంగీకారంతో ఇద్దరూ ఒక్కటయ్యారు. మరాఠీ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చినప్పటికీ చిన్న విభేదాలు కూడా లేకుండా 12 ఏళ్ల వైవాహిక జీవితం పూర్తి చేయటమే కాదు, ఓ స్టార్ హీరో సక్సెస్ వెనకాల ఆమె కృషి కూడా ఉందని చాలా సందర్భాల్లో నిరూపించుకుంది.

పెళ్లి తర్వాత పలువురు హీరోయిన్లు రీఎంట్రీల కోసం ఎగబడిపోతుంటే ఇంత బ్యాగ్రౌండ్ ఉండి కూడా నమ్రత మాత్రం సైలెంట్ గా తన పూర్తి సమయం కుటుంబానికే కేటాయిస్తుంది. మరి అలాంటి సూపర్ స్టార్ వైఫ్ మహేష్ కున్న ఓ బ్యాడ్ హాబిట్ గురించి చెప్పేస్తోంది. పిల్లలను అతిగారాబం చేయటంలో మహేష్ కి తనకి తరచూ మాటల యుద్ధం జరుగుతుందని చెబుతోంది. సినిమాలతో మహేష్ ఎంతో బిజీగా ఉన్నప్పటికీ... కొంచెం తీరిక దొరికినా పిల్లలు గౌతమ్, సితారలతో గడుపుతాడని నమ్రత తెలిపింది. పిల్లలను అతి గారాబం చేస్తాడని... వాళ్లు ఏది అడిగినా కొనిపెట్టేది మహేషే అని చెప్పింది. ఈ విషయంలో కొన్నిసార్లు మహేష్ కి తనకు గొడవ జరుగుతుందని, తనే పిల్లను పాడు చేస్తున్నావంటూ దెప్పిపొడుస్తుంటానని తెలిపింది. తల్లిదండ్రుల్లో ఒకరు గారాబం చేస్తే, మరొకరు క్రమశిక్షణను పిల్లలకు అలవాటు చేయాలన్న అభిప్రాయం వ్యక్తం చేసింది.

ఇక మహేష్ ఓ మంచి తండ్రే కాదని, ఓ మంచి కొడుకు కూడా అని చెప్పిన నమ్రతా తన కుటుంబం కోసం, కుటుంబ సభ్యుల కోసం మహేష్ ఏమైనా చేస్తాడని కితాబిచ్చింది. ఖలేజా సమయంలో తన పేరెంట్స్ చనిపోతే షూటింగ్ కాన్సిల్ చేసుకుని కొన్ని రోజులపాటు తనకు అండగా ఉన్నాడని తెలిపింది. మహేష్ ఓ మంచి నటుడే కాదు, అంతకు మించి ఓ మంచి మనస్సున్న వ్యక్తి అని చెబుతూ అతనితో పరిచయం కావటమే తన జీవితంలో జరిగిన ఓ గొప్ప సంఘటన అంటూ హ్యాపీనెస్ వ్యక్తం చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mahesh Babu Wife  Namrata Shirodkar  Interview  

Other Articles