క్వీన్ ఎలిజిబెత్ తో కమల్... స్టెప్పులేసిన ఇంగ్లాండ్ రాణి | Kamal Hassan meet England queen Elizabeth-II.

Kamal hassan with queen elizabeth

Kamal Haasan Queen Elizabeth-II, Universal Hero Buckingham Palace, Buckingham Palace Indiam Celebrities, UK-India Year of Culture-2017, Queen Elizabeth Indian Dance, Queen Elizabeth Kamal Hassan, Kamal Hassan Meet England Queen

Universal Hero Kamal Haasan Meet England queen Elizabeth-II at Buckingham Palace. To Participate in UK-India Year of Culture-2017 along with some other celebrities.

క్వీన్‌ ఎలిజబెత్‌ తో కమల్ కరచలనం

Posted: 03/01/2017 10:20 AM IST
Kamal hassan with queen elizabeth

ఈ మధ్య ట్వీట్లతో తమిళ రాజకీయాలపై తీవ్రంగా విరుచుకుపడుతున్న కమల్ హాసన్ త్వరలో కొత్త పార్టీ పెట్టబోతున్నాడంటూ ఓ వార్త కూడా ఈ మధ్య చక్కర్లు కొడుతోంది. ఎప్పుడు ఎలాంటి సంచలనాలు పేలుస్తాడో తెలీని కమల్ ఇప్పుడు ఓ కొత్త పోటోతో సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాడు. ఏకంగా క్వీన్ ఎలిజబెత్ రాణీ తో కలిసి దిగిన ఓ ఫోటో నెట్ లో చక్కర్లు కొడుతోంది.

విషయం ఏంటంటే.. ఎలిజబెత్‌ దంపతులు తమ అధికారిక నివాసమైన బకింగ్‌హామ్‌ ప్యాలెస్‌లో యూకే-భారత్‌ ఇయర్‌ ఆఫ్‌ కల్చర్‌ 2017 కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం క్వీన్ ఎలిజబెత్-2 ఆధ్వర్యంలోనే జరగ్గా ఇండియా తరపున ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నేతృత్వంలోని ఓ బృందం హాజరయ్యింది. ఇందులో కమల్ తోపాటు మళయాళ స్టార్ హీరో సురేష్ గోపీ, గుర్ దాస్ మన్, డిజైనర్ మనీష్ మల్హోత్రా, క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్, వ్యాపార దిగ్గజం రతన్ టాటా తదితరులు పాల్గొన్నారు.

అక్కడ రాణి ఎలిజిబెత్ ను కలిసిన కమల్ ఆప్యాయంగా పలకరించి ఆమె తో కరచలనం చేసి ఓ ఫోటో దిగాడు. తనకు ఈ అవకాశం కల్పించిన కేంద్ర ప్రభుత్వానికి, తన పేరును నామినేట్ చేసిన ప్రధాని నరేంద్ర మోదీకి కమల్ ప్రత్యేక కృతజ్నత తెలిపాడు. దీంతో కమల్ తన యూనివర్సల్ ట్యాగ్ లైన్ కి జస్టిఫికేషన్ చేశాడంటూ అభిమానులు సంబరపడిపోతున్నారు. ఇక ఇదే కార్యక్రమానికి హాజరైన ప్రముఖ డ్యాన్సర్‌ అరుణిమ కుమార్‌ ఏకం అనే స్పెషల్ డాన్స్ ప్రదర్శించగా, అది చూసి ఆశ్చర్యపోయిన రాణి ఆమెను అభినందించటంతోపాటు తాను స్టెప్పులేసి అక్కడున్న వారిని ఆశ్చర్యపరిచిందంట.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kamal Hassan  Queen Elizabeth-II  Buckingham Palace  

Other Articles