బన్నీ బ్రాహ్మిణ్ లుక్ లీక్.. సరిగ్గా ఫస్ట్ లుక్ ముందు రోజే.. | Brahmin Look of Allu Arjun leaked.

Allu arjun dj look reveal

Allu Arjun, DJ Brahmin Look, DJ Leak Photos, Allu Arjun Brahmin Look, Duvvada Jagannadham Movie, Duvvada Jagannadham Photos Leak, Duvvada Jagannadham Brahmin Look, Bunny Duvvada Jagannadham, Duvvada Jagannadham Bunny Look

Allu Arjun's Brahmin look got leaked on net a day prior to the scheduled date of release. Though the leaked stills are poor in quality, mega fans were thrilled to see the traditional Brahmin look of Allu Arjun and are imaging how witty the dialogues would be mouthed by the star.

డీజే బన్నీ లుక్ లీక్ అయిపోయింది

Posted: 02/17/2017 10:41 AM IST
Allu arjun dj look reveal

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కు లీక్ ఎఫెక్ట్ తప్పలేదు. రేపు అంటే ఫిబ్రవరి 18న ఈ చిత్ర ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే అందుకు సంబంధించి ఫ్రీ లుక్ పోస్టర్ ను  కూడా వదిలారు. అయితే ఇంతలో డీజేలో బన్నీ లుక్ ను రివీల్ చేస్తూ ఓ పోస్టర్ నెట్ లో చక్కర్లు కొడుతోంది. ఇంతకు ముందు బన్నీ ఓ బ్రాహ్మణుడి పాత్ర పోషిస్తాడని.. అదుర్స్ చారి టైపులో ఈ కేరక్టర్ ఉంటుందనే టాక్ ఉండేది.

రీసెంట్ రిలీజ్ చేసిన ప్రీ లుక్ పోస్టర్ కూడా శివలింగం, రుద్రాక్ష ఇలా ఉండటంతో అదే ఖాయం చేసుకున్నారు కూడా.కానీ, ఇంటర్నెట్ లో ఓ లీక్డ్ పిక్చర్ హంగామా చేస్తోంది. ఈ ఫోటో ప్రకారం డీజేలో బన్నీ చేస్తున్న రోల్.. బ్రాహ్మణుడి రోల్ అనే విషయం తెలిసిపోయినట్లే. పిలక పెట్టినట్లుగా దువ్విన జుట్టు.. ఒళ్లంతా విబూధి నామాలు.. పంచె కుట్టు.. కాషాయ వస్త్రం.. మెడలో యజ్ఞోపవీతం.. అబ్బో బన్నీ లుక్ అదిరిపోయిందంతే.

లీక్డ్ ఫోటో అయినా.. నెట్ లో ఇప్పుడు బన్నీ కొత్త లుక్ వైరల్ అయిపోయింది. సరిగ్గా ఫస్ట్ లుక్ ముందు రోజే ఇలా బయటికి వచ్చేయటంతో దీనిపై చిత్ర యూనిట్ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. క్లారిటీ సరిగ్గా లేకపోవటం చూస్తే దూరం నుంచి ఎవరైనా అభిమానులు తీసి దీనిని నెట్ లో అప్ లోడ్ చేసి ఉంటారని భావిస్తున్నారు.

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Duvvada Jagannadham  Bunny  Brahmin Look  Leak Photos  

Other Articles