వార్నీ.. అంతలా తిట్టుకుని ఏందిదీ? | PVP and Vamsi Paidipally at Ghazi Premier.

Vamsi paidipally pvp clash end

PVP and Vamsi Paidipally, Vamsi Paidipally at Ghazi Premier, Ghazi Premier Show, Celebs at Ghazi Premier Show, Ghazi Premier Show Photos, PVP and Vamsi Paidipally at Ghazi Premier, PVP and Vamsi Clash, Director Vamsi Paidipally, PVP, Produver PVP

PVP and Vamsi Paidipally Clash finally end. Both Spotted together at Ghazi Premier show closely.

పీవీపీ-వంశీ కాంప్రమైజ్ అయ్యారోచ్...

Posted: 02/15/2017 01:29 PM IST
Vamsi paidipally pvp clash end

శాశ్వత మిత్రులు, అలాగని శాశ్వత శత్రువులు ఉండరనే నానుడి రాజకీయాలకే కాదు.. సినిమాలకు కూడా ఇప్పుడు వర్తిస్తోంది. అందుకు కారణం మీడియా సాక్షిగా దర్శకుడు శీనువైట్లను ఏకీ పడేసిన ప్రకాశ్ రాజ్ ఉదంతమే. ఆగడు సినిమా సమయంలో జరిగిన ఆ రచ్చ తర్వాత మళ్లీ వారిద్దరు ఎలా కాంప్రమైజ్ అయ్యారో తెలిసిందే. సరిగ్గా అలాంటి ఉదంతమే ఇక్కడ మరోకటి చూద్దాం.

కొంతకాలం క్రితం పీవీపీ వర్సెస్ దర్శకుడు వంశీ పైడిపల్లి మధ్య జరిగిన గొడవ గురించి తెలిసిందే. ఊపిరి సినిమా వల్ల తనకు 20 కోట్ల నష్టం వచ్చిందని, ఆ లాస్ కవర్ చేసేందుకు తనతో తర్వాతి చిత్రం చేయాలన్న ఒప్పందం ఉల్లంఘించి వంశీ మహేష్ బాబుతో వేరే బ్యానర్ లో సినిమా తీయటంపై వరప్రసాద్ ఫైర్ అయ్యాడు. అంతేకాదు ఈ విషయమై ఫిల్మ్ ఛాంబర్ లో పిర్యాదు కూడా చేశాడు. మరోవైపు పీవీపీ పచ్చి అబద్ధాల కోరు అంటూ వ్యాఖ్యలు చేసిన వంశీ లీగల్ వార్ కు రెడీ అయ్యాడు కూడా.

కట్ చేస్తే.. పీవీపీ నిర్మించిన ఘాజీ ప్రీమియర్ షోలు ప్రధాన పట్టణాలలో వేస్తున్నారు. ఈ నేపథ్యంలో సెలబ్రిటీల కోసం పీవీపీ నిన్న ఓ షో వేశాడు. ఆ ఈవెంటుకు వంశీని కూడా ఇన్వయిట్ చేశాడు కూడా . అక్కడ ఇద్దరూ కలసి నవ్వుతూ ఫోటోలకు ఫోజులు ఇచ్చారు . దీని చూసిన వారంతా అసలు అంతలా గొడవ పడిన ఈ ఇద్దరేనా? అన్నట్లుగా చూస్తూ ఉండిపోయారు. మరి వారిద్దరు ఎలా కాంప్రమైజ్ అన్నదాన్ని పక్కనబెట్టి ఇలాగే కలిసి మెలిసి ఉండాలని కోరుకుందాం. ఇది కూడా చదవండి.. వంశీ-పీవీపీ అసలు గొడవేంటి?

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ghazi Premier Show  PVP  Director Vamsi Paidipally  

Other Articles