ఊపిరి లాస్ ఉత్తదే.. లీగల్ వార్ కి సిద్ధం:వంశీ | Vamsi ready for legal battle with PVP.

Vamsi won t budge to pvp allegations

Vamsi Paidipally, Prasad V. Potluri, PVP Vamsi Paidipally, Oopiri clash, PVP Vamsi Oopiri battle, Vamsi Paidipally legal, PVP complaint Vamsi, PVP allegations, Mahesh Babu Vamsi Paidipally

Vamsi Paidipally denies rumours of Oopiri loss, but PVP claims that they incurred losses of Rs. 20 crore on ‘Oopiri’ (directed by Vamsi), as the budget shot up to Rs. 70 crore.

ఊపిరి నష్టం పచ్చి అబద్ధం: వంశీ

Posted: 01/05/2017 11:52 AM IST
Vamsi won t budge to pvp allegations

టాలీవుడ్ లో మరో వివాదం చిలికి చిలికి గాలి వానగా మారుతోంది. దర్శకుడు వంశీ పైడిపల్లి, ప్రముఖ నిర్మాత పొట్లూరి వరప్రసాద్ మధ్య మహేష్ సినిమా పెట్టిన చిచ్చు పెద్దది అవుతోంది. ఊపిరి సినిమా తర్వాత మరో సినిమా తన బ్యానర్ లో చేయాల్సి ఉండగా, వంశీ ఆ కాంట్రాక్ట్ ను బ్రేక్ చేశాడన్నది పీవీపీ వాదన. హిట్ టాక్ తెచ్చుకున్నప్పటికీ, ఊపిరి తనకు తీవ్ర నష్టాన్ని మిగిల్చిందని, కాబట్టి వంశీ తనతో సినిమా తీయకుండా మహేష్ సినిమా కమిట్ అవటం సరైంది కాదని పీవీపీ తీవ్ర ఆరోపణలు చేశాడు. ఈ క్రమంలో నిర్మాతల మండలిలో ఓ ఫిర్యాదు కూడా చేసిన విషయం తెలిసిందే.

నాగ్-కార్తీ మల్టీస్టారర్ గా తెరకెక్కిన ఊపిరి ఒకానోక టైంలో దరిదాపు వంద కోట్ల కలెక్షన్లకు దగ్గరైందని టాక్ కూడా వినిపించింది. అలాంటి సినిమాకు 20 కోట్ల నష్టం వాటిల్లిందనేది పీవీపీ వాదన. అయితే దర్శకుడు వంశీ పైడిపల్లి మాత్రం ఆ ఆరోపణను కొట్టిపడేస్తున్నాడు. ఆ సినిమాకు నష్టం వచ్చిందన్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని అంటున్నాడు. పీవీపీ సంస్థ వేసిన కేసులను న్యాయ పరంగా ఎదుర్కొంటానని వెల్లడించారు.

ఇక వీరి ఇద్దరి కాంబినేషన్లో మహేష్ బాబు హీరోగా ఓ సినిమా చేయాల్సి ఉండగా ఆ ప్రాజెక్ట్ మరో నిర్మాత దిల్ రాజు చేతికి వెళ్లటం, ఆపై అశ్వనీదత్ దానికి జత కలవటం తెలిసిందే. దీంతో వంశీ-పీవీపీ మధ్య వివాదం మొదలై తారాస్థాయికి చేరుకుంది. మరోవైపు బ్రహ్మోత్సవం నష్టం నుంచి గట్టెక్కించేందుకు మహేష్ పీవీపీతో సినిమా చేయాలనుకుని ఆ తర్వాత ఆ ఆలోచనను విరమించుకున్నాడు. మహేష్ లాంటి స్టార్ హీరోతో పెట్టుకోలేకనే ప్రసాద్ ఇలా దర్శకుడిపై పడ్డాడన్నది వంశీ మద్ధతుదారులు చెబుతున్న మాట.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Vamsi Paidipally  Prasad V. Potluri  Oopiri loss  

Other Articles

Today on Telugu Wishesh