ఇన్ స్టాగ్రామ్ ఫోటోతో బుక్కయిన అమలా.. అతనితోనే అఫైరా? | Amala Paul Controversial Kiss.

Amala paul on her kiss photo

Amala Paul Controversial Kiss, Amala Paul Instagram, Amala Paul Affair, Amala Paul Instagram Kiss, Amala Paul Kiss Photo, Amala Paul Controversy, Amala Paul Hud Kiss

Kollywood star actress Amala Paul has been rumored to in a relationship post her divorce. This rumor is strengthened with her recently released Instagram picture.she revealed that the man is her long term good friend and also married. She said that the photo was taken when she had been to Kerala to meet her old friends. later she revealed his name as Ajith Menon. Now all are questioning about hugging and kissing a married man isn’t good.

ముద్దు వివాదంపై స్పందించిన అమల

Posted: 02/14/2017 05:04 PM IST
Amala paul on her kiss photo

నటి అమలాపాల్ విడాకులకు వేరే వ్యక్తితో ఉన్న సంబంధమే కారణమంటూ గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ పుకారుకు బలం చేకూర్చే సాక్ష్యం ఇదేనంటూ ఓ ఫోటో ఆమె ఇన్ స్టాగ్రామ్ లో హల్ చల్ చేస్తోంది.

దర్శకుడు ఏ ఎల్ విజయ్ తో ప్రేమ, పెళ్లి తర్వాత మామ దగ్గరి నుంచి సినిమాల్లో నటించొద్దనే ఒత్తిడి రావటంతోనే ఆమె విడాకులు తీసుకుంటుందని తెలిసిందే. అదే సమయంలో హీరో ధనుష్ తోపాటు మరికొందరితో రిలేషన్ షిప్ అంటగట్టి ఆ కారణంతోనే డైవోర్స్ తీసుకోబోతుందని కొన్ని కథనాలు వెలువడ్డాయి. కానీ, అవేం పట్టించుకోకుండా అమల తన పని తాను చేసుకోబోతుంది.

ఇక అప్పటి నుంచి ఓ రేంజ్ లోనే సోషల్ మీడియాలో ఫోటోలు అప్ లోడ్ చేస్తూ వస్తోంది. రీసెంట్ గా ఇన్ స్టాగ్రామ్ లో ఓ వ్యక్తితో అత్యంత సన్నిహితంగా ఉన్న ఫోటోను అప్ లోడ్ చేసింది అమలాపాల్. ఓ వ్యక్తిని కౌగిలించుకుంటూ, ఆపై ముద్దు పెడుతూ ఫోజులిచ్చింది. దీంతో అతనితోనే ఆమె అఫైర్ అంటూ వార్తలు వచ్చాయి. ఇక అమలకు ఇదేంపాడు బుద్ధి అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరోపక్క అతను అమలకు జస్ట్ ఫ్రెండ్ మాత్రమే అని సన్నిహితులు చెబుతున్నారు. దీనిపై అమల ఓపెన్ అయితేనే అసలు విషయం ఏంటో తెలిసేది. అందుకే రంగంలోకి దిగి వివరాలను వెల్లడించింది.

అతని పేరు అజిత్ మీనన్. తన చిన్ననాటి స్నేహితుడు. అల్రెడీ పెళ్లయ్యింది కూడా. కేరళలో తామంతా కలుసుకున్నప్పడు ఇలా ఫోటో దిగినట్లు చెప్పుకొచ్చింది. మరి ఇంత క్లియర్ గా చెప్పాక అయినా ఈ వార్తకు ఫుల్ స్టాప్ పడుతుందో.. లేక మరిన్ని కథనాలను జోడిస్తారో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Amala Paul  Controversial Kiss  Instagram  

Other Articles