రెండు బ్లాక్ బస్టర్లు అయినా.. 4 కోట్ల దాకా లాస్? | Dil Raju again fail as distributor.

Dil raju huge loss with nag movie

Om Namo Venkatesaya, Om Namo Venkatesaya Dil Raju, Om Namo Venkatesaya Loss, Om Namo Venkatesaya Collections, Dil Raju Distributor, Nizam Distributor Dil Raju, Dil Raju Nenu Local Shatamanam Bhavati

Dil Raju got a rude shock as a distributor. The successful producer also releases some big movies through his distribution company and he bagged the rights of "Om Namo Venkatesaya" in Nizam area. He is said to have bought the movie's rights for whopping Rs 8.5 Cr. As the film has failed to take any decent openings in the first weekend, the trade pundits say Dil Raju may end of losing more than Rs 4 Cr on this project. Om Namo Venkatesaya Distribution

దిల్ రాజు ప్రోడ్యూసర్ గా హిట్.. డిస్ట్రిబ్యూటర్ గా ఫట్

Posted: 02/14/2017 12:54 PM IST
Dil raju huge loss with nag movie

టాలీవుడ్ లో ఈ యేడు బాగా కలిసొచ్చింది ఎవరికంటే దిల్ రాజు అనే పేరు టక్కున చెప్పుకుంటాం. కేవలం యావరేజ్ కంటెంట్ సినిమాలతో బ్లాక్ బస్టర్లు కొట్టిన ఘనత ఈ స్టార్ ప్రొడ్యూసర్ ది. ఖైదీ నంబర్ 150, శాతకర్ణి సినిమాలతో పోటీపడి మరీ రిలీజ్ చేసినప్పటికీ తెలివిగా బిజినెస్ చేసి ఆ చిత్రాల కంటే భారీగా లాభాలు ఆర్జించి సిసలైన సంక్రాంతి బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

ఇక నేను లోకల్ తో జస్ట్ 10 రోజుల్లో 26.5 కోట్లు రాబట్టి రీసెంట్ గా మరో బ్లాక్ బస్టర్ ను రుచి చూశాడు. ఈ రెండు సినిమాలు రాజుకి సుమారు 10 నుంచి 15 కోట్ల లాభమే తెచ్చినట్లు ఓ లెక్క. దీంతో నిర్మాతగా రాజు నిర్ణయాలు సరిగ్గా ఉన్నాయని మరోసారి రుజువైంది. అదే సమయంలో డిస్ట్రిబ్యూటర్ గా మరోసారి ఫేలయి భారీ నష్టాన్నే చవిచూడబోతున్నాడు కూడా.

నాగ్ నటించిన ఓం నమో వేంకటేశాయ నైజాం హక్కులను 8.5 కోట్లకు దిల్ రాజు సొంతం చేసుకున్నాడు. తనకు బాగా పట్టున్న ఏరియా కావటంతో ఎక్కువ థియేటర్లే ఇప్పించాడు కూడా. అయితే పరిస్థితి మాత్రం రివర్స్ అయ్యింది. హిట్ టాక్ వచ్చినప్పటికీ నమోవేంకటేశాయకు కలెక్షన్లు మాత్రం చాలా డల్ గా ఉన్నాయి. ఫస్ట్ వీకెండ్ లో మినిమమ్ కలెక్షన్లు కూడా రాబట్టలేదంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ లెక్కన లాంగ్ రన్ లో సుమారు 4 కోట్ల దాకా నమో వేంకటేశాయ లాస్ కలిగించవచ్చనే ట్రేడ్ పండితులు చెబుతున్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Shatamanam Bhavati  Nenu Local  Dil Raju  Om Namo Venkatesaya  

Other Articles