పవన్ సినిమా చేయను పొమ్మన్నాడు.. ఎందుకు? | Why Harshavardhan reject Pawan movie.

Writer reject to work with pawan kalyan

Harshavardhan, Writer Harshavardhan, Pawan kalyan, Harshavardhan Pawan Kalyan, Pawan kalyan Harshavardhan, Tollywood Actor Harshavardhan, Ishq Manam Writer, Telugu Writer Harshavardhan, Vedalam Writer, Pawan Movie Reject, Actor-writer Harshavardhan, Remake of Vedalam, Good, Bad & Ugly

Actor-writer Harshavardhan, has scrapped his upcoming project, which is a remake of Vedalam starring Pawan Kalyan. The movie will be directed by Tamil filmmaker RT Neason. The buzz is that Harsha is busy with his directorial debut of romantic thriller titled Good, Bad & Ugly.

పవన్ సినిమాని తిరస్కరించిన రైటర్

Posted: 02/08/2017 02:47 PM IST
Writer reject to work with pawan kalyan

సాధారణంగా టెక్నీషియన్లకు ఓ స్టార్ హీరోతో పని చేసే అవకాశం వస్తే ఎగ్జయిట్ అవ్వటం కామన్. కానీ, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమానే వదులుకున్నాడు ఇక్కడో రైటర్. అందుకు కారణం తన లక్ష్యం దెబ్బకూడదనేనంట. ఇంతకీ అతనెవరో కాదు, అమృతం సీరియల్ ద్వారా తెలుగు ప్రజలకు సుపరిచితుడైన నటుడు కమ్ రైటర్ హర్షవర్థన్.

అవును.. ఇష్క్, గుండెజారి గల్లంతయ్యిందే, మనం వంటి చిత్రాలకు మాటలు అందించి క్లాసిక్ రైటర్ గా ఎస్టాబిష్ అవుతున్న ఈ నటుడికి పవన్ సినిమాకు పని చేసే ఛాన్స్ దక్కిందంట. అయితే తాను దర్శకత్వం చేయాలన్న కలను వదులుకోలేక ఆ సినిమాను వదిలేసినట్లు చెబుతున్నాడు. 

మెగా ఫోన్ పట్టాలని గత రెండేళ్లుగా తాను చేస్తున్న ప్రయత్నాలు ఫలించిన సమయం ఆసన్నమయిన వేళ ఈ ఛాన్స్ దక్కింది. వేదాలం రీమేక్ గా తెరకెక్కబోయే చిత్రానికి మాటలు రాయమని నన్ను నిర్మాత ఏఎం రత్నం సంప్రదించాడు. అయితే తన దర్శకత్వ కల వాయిదా పడిపోతుందని భావించే ఆ నిర్ణయం తీసుకున్నానని తెలిపాడట. ఇప్పుడు కాకపోయినా ఫ్యూఛర్ లో అయినా ఆ అవకాశం మరోసారి దక్కుతుందనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు హర్షవర్థన్.

ఇక శ్రీముఖి హీరోయిన్ గా గుడ్, బ్యాడ్ అండ్ అగ్లీ పేరుతో ప్రస్తుతం హర్షవర్ధన్ ఓ సినిమాను డైరక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇదికాకుండా సుధీర్ బాబును డైరక్ట్ చేసే మరో అవకాశం అతనికి దక్కినట్లు సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Actor-writer Harshavardhan  Pawan Kalyan  Vedalam Remake  Good  Bad & Ugly  

Other Articles