పవర్ స్టార్ ను తిట్టినోడిని మెగాస్టార్ పొగిడాడే! | Megastar praised Kamal R Khan.

Kamaal r khan leaks amitabh bachchan message

Kamal R Khan, Kamal R Khan Pawan Kalyan, Kamal R Khan Amitabh Bachchan, Amitabh Bachchan Tweet, Amitabh Bachchan Message Leak, Amitabh Bachchan KRK, KRK Sarkar 3 Trailer, Sarkar 3 Trailer

KRK has leaked a sms on Twitter that was sent to him by none other than Amitabh Bachchan. The message shows the superstar praising KRK for something. It reads, “You have become the barometer of the box office. Hoping that this prediction comes true.” And just when we were wondering if this is genuine or not, and how Big B would react to it, he came out clarifying this text message. Furthermore, Amitabh Bachchan is actually obliged that KRK shared his message on Twitter. He replied on the same tweet saying, “this is was my response when KRK saw trailer of Sarkar 3, liked it and predicted it to be a HIT !! lets hope so !!??”

అమితాబ్ మెసేజ్ ను లీక్ చేసిన కమల్

Posted: 02/08/2017 11:49 AM IST
Kamaal r khan leaks amitabh bachchan message

బాలీవుడ్ లో ఓ క్రిటిక్ ఉన్నాడు. అతగాడికి ఎంత దూల అంటే హీరో, హీరోయిన్లను ఎవరినీ వదలకుండా విపరీతమైన కామెంట్లు చేస్తుంటాడు. సూపర్ స్టార్లు కూడా అందుకు మినహాయింపు కాదు. కబాలి సమయంలో రజనీకాంత్ ను, సర్దార్ గబ్బర్ సింగ్ సమయంలో పవన్ కళ్యాణ్ ను, ఆఖరికి కరణ్ జోహర్, అజయ్ దేవగన్ మధ్య అప్పట్లో చిచ్చు పెట్టింది ఇతగాడే. ఇక అతనెవరో మీకు ఈ పాటికే తెలిసిపోయి ఉండాలి. అతనే కమల్ రషీద్ ఖాన్.. ముద్దుగా కేఆర్కే అని పిలుచుకుంటారు.

ఓ రెండు, మూడు సీ గ్రేడ్ చిత్రాల్లో నటించటమేకాదు, డైరక్ట్ చేసిన అనుభవం అతనిది. అయినప్పటికీ వంద చిత్రాల దర్శకుడి మాదిరి స్టార్ల సినిమాలపై కామెంట్లు, లో రేటింగ్ లు ఇస్తుండటం అతనికి అలవాటు. అలియా బికినీ దగ్గరి నుంచి రజనీ రంగు దాకా అన్నింటిపైనా అతగాడు కామెంట్లు చేసి తీవ్ర విమర్శలు ఎదుర్కున్నాడు. అలాంటి కేఆర్కే మరోసారి వార్తల్లో నిలిచాడు. అయితే ఈసారి తన ఫోన్ కి వచ్చిన ఓ ప్రైవేట్ మెసేజ్ ను పబ్లిక్ చేసి ఇతగాడు వార్తల్లో నిలిచాడు లేండి.

ఇంతకీ విషయం ఏంటంటే... రీసెంట్ గా రిలీజ్ అయిన సర్కార్-3 ట్రైలర్ ను చూసిన కమల్ సినిమా బ్లాక్ బస్టర్ అంటూ ఏకంగా  మెగాస్టార్ బిగ్ బీ కే ఓ మెసేజ్ పెట్టాడు. దానికి స్పందించిన అమితాబ్ బాక్సాఫీస్ వద్ద మీరోక బారోమీటర్ లా తయారయిపోయారు. మీరు చెప్పారంటే సినిమా ఖచ్ఛితంగా హిట్ అయి తీరుతుంది. థాంక్స్ అంటూ ఓ రిప్లై ఇచ్చాడు.

అంతే ఇక ఆ మెసేజ్ ను పట్టుకుని కమల్ టాం టాం చేసుకుంటున్నాడు. తన ట్విట్టర్ తోసహా అన్ని మాధ్యమాల్లో దాన్ని పోస్ట్ చేయటమే కాదు, ఇన్నేళ్లలో నేను సాధించిన గొప్పతనం ఇదేనంటూ గర్వంగా దానిని పత్రికల్లో కూడా యాడ్ ఇచ్చుకున్నాడు. అయితే తిక్క కామెంట్ల చేసి తిట్లు తినే కమల్ కు బిగ్ బీ ఈ మేసేజ్ చేశాడా? అన్న డౌట్లు ఇప్పుడు చాలా మందికే వస్తున్నాయి. దీనిని కన్ఫర్మ్ చేస్తూ అమితాబ్ ట్వీట్ చేయటం ఇక్కడ అసలు ట్విస్ట్.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Amitabh Bachchan  Kamal R Khan  Message  Twitter  

Other Articles