వర్మ ట్వీట్లు: అమ్మ ఆత్మ.. మోదీ భూత వైద్యుడు.. ఓ హర్రర్ సినిమా | RGV response on Panneerselvam Amma Soul's Comments.

Rgv tweets on tamil nadu politics

Modi Exorcist, RGV OPS, Varma Panneerselvam, Panneerselvam Amma Soul, Jayalalithaa Soul Panneerselvam, Jayalalitha Ghost, Ram Gopal Varma Tamil Nadu Politics, Tamil Nadu Politics Horror Movie

Director Ram Gopal Varma Interesting tweets on Tamil Nadu Politics. Respond in his twitter on Panneerselvam's Amma Soul Comments. Tweets Happenings in TN seem like a political Horror film with OPS claiming Jayalalitha's ghost told him to be CM..Will Modi be the exorcist now?.

పన్నీర్ సెల్వం, మోదీలపై వర్మ ట్వీట్లు

Posted: 02/08/2017 10:25 AM IST
Rgv tweets on tamil nadu politics

ఏ టాపిక్ ను వదలకుండా కెలిగే దర్శకుడు ‘వివాదాల’ వర్మ తమిళనాట రాజకీయాలపై స్పందించాడు. నిన్నంతా సోషల్‌ మీడియాలో చక్కర్లు కొట్టిన ఓ ఫోటోను చూపిస్తూ జయలలిత వెనకాల బ్యాగ్ మోసేది శశికళేనా? అంటూ ప్రశ్నలు గుప్పించాడు. ఇక పన్నీర్ సెల్వం తిరుగుబాటు నేపథ్యంలో మరో ఆసక్తికర ట్వీట్ చేశాడు.

పురుచ్చిత్తలైవి జయలలిత ఆత్మ తనతోమాట్లాడిందనీ, ముఖ్యమంత్రిగా తానే ఉండాలంటూ కోరిందంటూ పన్నీర్‌ సెల్వం వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. దీనిపై వర్మ తనదైన శైలిలో స్పందించారు. తమిళనాట రాజకీయాలు రాజకీయ హారర్‌ మూవీని తలపిస్తున్నాయంటూ సెల్వంకు మరో సెటైర్ వేశాడు. అమ్మ ఆత్మ పన్నీర్‌ సెల్వం రాష్ట్ర ముఖ్య​మంత్రిగా ఉండాలని ఆదేశిస్తే.... ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భూత వైద్యుడు కానున్నాడా? అంటూ ట్వీట్‌ చేశారు.

కాగా, పన్నీర్ ధిక్కారం వెనక మోదీ సర్కారు వ్యూహం​ ఉంది.. మోదీ అండతోనే పన్నీర్ సెల్వం శశికళపై తిరుగుబాటుకు సిద్ధమయ్యారనే ఊహాగానాలు చెలరేగుతుండగానే. వర్మ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. జయ చనిపోయిన సమయంలో శశికళ పేరు మీద ఓ సినిమా తీయనున్నట్లు వర్మ ప్రకటించిన విషయం తెలిసిందే. అదే రాజకీయాలపై కాకుండా ఓ ప్రేమకథగా ఉంటుందని తెలిపాడు కూడా. మరి పన్నీర్ సెల్వంపై సినిమా తీస్తాడా? అన్న దానిపై క్లారిటీ ఇవ్వలేదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ram Gopal Varma  Tamil Nadu  Politics  Horror Movie  Jayalalithaa  Sasikala  O Panneerselvam  Narendra Modi  

Other Articles