ఆ హీరోయిన్ కు చావాల్సిన అవసరం ఏంటి? రేప్, టార్చర్ చేసి చంపారా? | Bitasta Saha Suspicious Death.

Actress bitasta saha found hanging in her flat

Bengali Actress, Bitasta Saha, Bengali Actress Death, Bengali Actress Suicide, Bengali Actress Murder, Bitasta Saha Suicide, Bitasta Saha Murder, Bitasta Saha Rape, Actress Suspicious Death

Bengali actress Bitasta Saha found hanging in Kolkata. Actress's Semi-Decomposed Body Found In Kolkata Flat, Wrist Slit. "After preliminary investigation, it seems like actress Bitasta Saha committed suicide due to frustration," a police official told.

ఉరేసుకుని బెంగాలీ హీరోయిన్ ఆత్మహత్య

Posted: 02/08/2017 11:07 AM IST
Actress bitasta saha found hanging in her flat

వినోద పరిశ్రమలో రాణిస్తున్న సమయంలోనే విషాదాంతం అవుతున్న నటీమణుల ఉదంతాలు రాను రాను పెరిగిపోతున్నాయి. వ్యక్తిగత వ్యవహారాలు, అవకాశాలు దక్కకపోవటం, ప్రేమ వ్యవహారాలు బెడిసి కొట్టడం ఇలా ఒక్కో కారణంతో వాళ్ల జీవితాలు అర్థాంతంగా ముగుస్తున్నాయి. తాజాగా మరో వర్థమాన నటి శవం ఆమె ఇంట్లో దొరకటం కలకలం రేపుతోంది.

ప్రముఖ బెంగాలీ నటి బితాస్తా సాహా తన ఫ్లాట్ లోనే ఉరేసుకున్న స్థితిలో సీలింగ్ కు వేలాడుతూ కనిపించింది. 28 ఏళ్ల బితాస్తా, కస్బా ప్రాంతంలో ఓ ఫ్లాట్ లో ఒంటరిగా నివసిస్తోంది. రెండు రోజులుగా ఆమె ఫోన్ కు ఎన్నిసార్లు కాల్ చేసినా సమాధానం రాలేదు. ఆపై ఫోన్ స్విచ్చాఫ్ రావడంతో ఆమె తల్లి ఫ్లాట్ కు వచ్చి చూసింది. లోపలి నుంచి గడియ పెట్టి ఉండటంతో అనుమానంతో స్థానికుల సహకారంతో పోలీసులకు సమాచారం అందించింది.

వారొచ్చి తలుపులు బద్దలు కొట్టి చూడగా, ఆమె శరీరం సీలింగ్ కు వేలాడుతూ కనిపించింది. దీంతో సాహా ఆత్మహత్య ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఆమె మణికట్టు విరిచేయబడి ఉండటం, పైగా శరీరంపై పలు చోట్ల గాయాలు ఉండటంతో అత్యాచారం, హత్య అనుమానాలు కలుగుతున్నాయి. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పంపామని, రెండు, లేదా మూడు రోజుల ముందే ఆమె మరణించి వుండవచ్చని పోలీసు అధికారులు తెలిపారు.

బుల్లితెరపై వీజేగా కెరీర్ ప్రారంభించిన బితాస్తా సీరియళ్లతోపాటు పలు చిత్రాల్లో కూడా ఆమె నటించింది. బాఘిని, బాంచ్ఛా ఎలో పిరే, కల్కియుగ్ లాంటి హిట్ చిత్రాలు అందులో ఉన్నాయి. మరోవైపు ఆమె ఫేస్ బుక్ పోస్టులు, ఇంట్లో గోడలపై రాతలను పరిశీలిస్తే ఆమె కొంత డిప్రెషన్ లో ఉన్నట్టు తెలుస్తోందని పోలీసులు చెబుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bengali Actress  Bitasta Saha  Death  Suicide  Murder  

Other Articles