కాటమరాయుడు.. 57 గంటల్లో 5 మిలియన్.. కబాలి ఒక్కటే మిగిలి ఉంది | Katamarayudu Teaser Now Eye on Kabali.

Katamarayudu teaser new record

Pawan kalyan Katamarayudu, Katamarayudu Teaser, Katamarayudu Records, Katamarayudu Youtube Records, Katamarayudu Khaidi No 150 Youtube, Katamarayudu 5 Millions Views, Katamarayudu YouTube

Pawan kalyan Katamarayudu Teaser clocked 5 million views in just 57 hours. Going by the numbers, "Katamarayudu" stands only next to Rajinikanth's "Kabali". Directed by Kishore Kumar Pardasani, the film also stars Shruti Haasan, Tarun Arora, Siva Balaji, Krishna Chaitanya and Kamal Kamaraju.

కాటమరాయుడు 5 మిలియన్ రికార్డు

Posted: 02/07/2017 03:34 PM IST
Katamarayudu teaser new record

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ కాటమరాయుడు తో మరోసారి చాటిచెప్పినట్లు అయ్యింది. మొన్న రిలీజైన టీజర్ యుట్యూబ్ లో దూసుకుపోతోంది ఖైదీ నంబర్ 150ను క్రాస్ చేసి కబాలి తర్వాతి ప్లేస్ లో నిలుచుంది. కేవలం అప్ లోడ్ చేసిన 57 గంటల్లోనే 5 మిలియన్ వ్యూస్ రాబట్టేసింది ''కాటమరాయుడు'' టీజర్.

రాయలసీమ బ్యాగ్రౌండ్ లోకేషన్లు, లుంగీలో పవన్ చేసిన సందడి, అలాగే ఎవడున్నాడనేది ముఖ్యం అంటూ పలికిన ఓ పంచ్ లైన్ అభిమానులను హుషారెత్తించేసింది. దానితో ప్రతీ ఒక్కరూ మౌత్ టాక్ చాలా పాజిటివ్ గా స్ర్పెడ్ చేయడంతో.. గత రెండు రోజుల నుండి యుట్యూబ్ లో ఈ టీజరే టాప్ ప్లేస్ లో ట్రెండ్ అవుతోంది. అందుకే ఇంత సులభంగా జస్ట్ రెండు రోజులు పూర్తయిన మరి కొన్ని గంటల్లోనే 5 మిలియన్ వ్యూస్ వచ్చేశాయి.

 

తమిళ సినిమా వీరమ్ కు రీమేక్ అయిన కాటమరాయుడు.. డాలీ దర్శకత్వంలో రూపొందుతోంది. ఈ సినిమాతో అనూప్ రూబెన్స్ స్వరాలు అందిస్తుండగా, శృతీహాసన్ హీరోయిన్ గా చేస్తోంది. మార్చి 29 ఉగాది కానుకగా కాటమరాయుడు రిలీజ్ కానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Katamarayudu  Teaser  YouTube  New Record  

Other Articles