హాలీవుడ్ బ్యూటీ ఇన్ స్టాలో సర్ ప్రైజింగ్ ఫోటోలు.. ఇండియన్స్ కి షాక్ | Miley Cyrus performs Lakshmi Puja at Malibu home.

Miley cyrus posted shocking photos

Miley Cyrus, Miley Cyrus Shock, Miley Cyrus Instagram Surprise, Miley Cyrus Lakshmi puja, Lakshmi Puja Hollywood Singer, Miley Cyrus India, Miley Cyrus Indian Tradition, Miley Cyrus Instagram, Miley Cyrus Indians, Miley Cyrus Lakshmi Puja at Home, Super Bowl Fruit Bowl

Miley Cyrus performs Lakshmi puja, posts a photo which also shows her gurus.Preferred 'fruit bowl' over Super Bowl.Is she embracing Hinduism?.

మైలీ సైరస్ ఇన్ స్టాలో షాకింగ్ ఫోటోలు

Posted: 02/07/2017 01:18 PM IST
Miley cyrus posted shocking photos

తన పాప్ ఆల్బమ్స్ తో, నటనతో చిన్న వయసులోనే క్రేజీ స్టార్ గా మారిపోయింది మైలీ సైరస్. ముఖ్యంగా హన్నా మాంటానా తో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన ఈ బ్యూటీ వివాదాస్పద విషయాల జోలికి పోయిన దాఖలాలు లేవు. ఓ తోటి సింగర్ తో ఆ మధ్య డేటింగ్ చేస్తుందన్న వార్తలు ఈ మధ్య చక్కర్లు కొట్టినప్పటికీ,అలాంటిదేం లేదని ఆ మధ్య ఖండించింది కూడా.

అయితే ప్రస్తుతం నమ్మశక్యం కానీ కొన్ని ఫోటోలు ప్రముఖ హాలీవుడ్ నటి ఇన్ స్టాగ్రామ్ లో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఈ యంగ్ బ్యూటీ తన ఇంట్లో లక్ష్మీ పూజను నిర్వహించింది. సోమవారం ఆమె తన ఇన్ స్టాలో ఫోటోలను అప్ లోడ్ చేయగా, అవి హల్ చల్ చేస్తున్నాయి. సాంప్రదాయంగా హిందూ పద్ధతిలో ఆ పూజలు జరిగాయి. పూలు, పండ్లు అన్నీ సమర్పించి పూజారీతో శాస్త్రోక్తంగా ఈ తంతును పూర్తి చేసింది.

అంతేకాదు ఇళ్లంతా పూలతో డెకరేషన్ చేసిన ఫోటో ఒకటి కూడా పెట్టింది. ఆశ్చర్యంతో ఇది చూసిన వారంతా ఆ లక్ష్మీ నీకు ఆరోగ్య ఐశ్వర్యాలు ప్రసాదిస్తుందంటూ కామెంట్లు పెడుతున్నారు. ఓవైపు అమెరికా సూపర్ బౌల్ ఫీవర్ తో ఊగిపోతుంటే, అనూహ్యంగా మైలీ ఈ పని చేయటం చర్చగా మారింది. నేటి యూత్ ఆచారాలు భ్రష్టు పట్టిస్తున్నారంటూ పండితులు ఆవేదన చెందుతున్న వేళ ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందిన ఈ రాక్ స్టార్ మన సాంప్రదాయాల గురించి తెలుసుకోవటం నిజంగా విశేషమే అనుకోవాలి. అయితే కొందరు మాత్రం ఆమె హిందుయిజంను అవమానించిందంటూ చెబుతుండటం కొసమెరుపు. 

Miley-Cyrus-performs-Lakshmi-Puja

Miley-Cyrus-performs-Lakshmi-Pooja

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Miley Cyrus  Lakshmi Puja  Fruit Bowl  Instagam  Indians  

Other Articles