అనసూయ వీడియో లీక్ కాకుండా జాగ్రత్త పడ్డాడంట | Gopichand Malineni about Anasuya Item Song.

Winner item song turns anasuya fate

Anasuya Bharadwaj, Anasuya Bharadwaj Item Song, Anasuya Bharadwaj Dance, Anasuya Bharadwaj Sai Dharam Tej, Sai Dharam Tej Anasuya, Sai Dharam Tej Winner Movie, Winner Movie Item Song, Sai Dharam Tej Anasuya, Anasuya Item Bomb, Suya Suya Anasuya Song, Mega Item Song 2017, Mega Item Girl

High Expectations on Anasuya Winner Item Song. Anchor turned actress Anasuya Bharadwaj has grooved to a special club number shot in Ukraine in this Telugu actioner. Starring Sai Dharam Tej, Rakul in the lead.

అనసూయ ఐటెం ఏ రేంజ్ లో పేలుతుందో...

Posted: 02/06/2017 12:56 PM IST
Winner item song turns anasuya fate

టాలీవుడ్ లో ఐటెం సాంగ్స్ డెఫినేషన్ పూర్తిగా మారిపోయింది. భారీ రెమ్యునరేషన్ మూలంగానో, లేక స్టార్ డమ్ పెరిగిపోతుందన్న ఉద్దేశ్యంతోనో స్టార్ హీరోయిన్లు కూడా ముందుకు వచ్చేస్తున్నారు. అయినా సరే పాటకు తగ్గట్లు ఉండే ముఖాలకే ప్రాధాన్యం ఇస్తున్నారు దర్శకనిర్మాతలు.

ఇక మెగా ఐటెం గర్ల్స్ విషయంలో అయితే ఇది మరీను. గతేడాది సరైనోడులో అంజలి బ్లాక్ బస్టర్ ఐటెం సాంగ్, రీసెంట్ గా ఖైదీ నంబర్ 150 లో రత్తాలుగా రాయ్ లక్ష్మీలు పండించిన మాస్ మసాలా ఏ రేంజ్ లో పండిన విషయం తెలిసిందే. దీంతో ఆచీతూచీ ఐటెం గర్ల్స్ ను ఎంపిక చేసుకుంటున్నారు. ఇక సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ కూడా హాట్ యాంకర్ అనసూయను తన విన్నర్ లోని ఐటెం సాంగ్ లో వాడుకున్న విషయం తెలిసిందే.

అయితే ఈ పాటకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ఇప్పుడు బయటికి వచ్చింది. అనసూయ క్రేజ్ ను దృష్టిలో పెట్టుకునే ఈ పాటను కావాలనే ఉక్రేయిన్ లో షూట్ చేశారంట. అల్రెడీ షూటింగ్ కోసం అక్కడకు వెళ్లిన టీం అనసూయను రప్పించి మరీ ఈ పాటను షూట్ చేశారని సమాచారం. పదిరోజుల పాటు చాలా గోప్యంగా జరిగిన షూటింగ్ లో ఫోటోలు, వీడియోలు ఇలా ఏ అంశాన్ని కూడా సెట్స్ నుంచి బయటికి పొక్కనీయకుండా చాలా జాగ్రత్తలే తీసుకున్నాడంట దర్శకుడు గోపీచంద్ మలినేని. మరి సూయ.. సూయ. అనసూయ అంటూ ఈ ఐటెం ఎలా పేలబోతుందో తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే.

ఇక సినిమా కోసం బాహుబలి, వరల్డ్ వార్ జీ చిత్రాలకు పని చేసిన స్టంట్ మాస్టర్ కలోయిన్ వోదెనిచరోవ్ పని చేసినట్లు గోపీచంద్ వివరించాడు. రకుల్, ఠాకూర్ అనూప్ సింగ్ లు కీలకపాత్రలు పోషిస్తున్న విన్నర్ చిత్రం ఈ నెల 24న గ్రాండ్ గా రిలీజ్ కానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Anchor Anasuya  Winner Movie  Item Song  

Other Articles