ప్రభాస్ హ్యాండిచ్చి ఇంకో సినిమా కమిట్ అయ్యాడా? | Rumour on Prabhas quit Sujeeth movie.

Prabhas sujeeth movie delay

Prabhas, Prabhas Sujeeth Movie, Director Sujeeth, Sujeeth Prabhas Movie, Prabhas Next Movie, Prabhas 2017, Prabhas Upcoming Movie, Prabhas Next movie, Prabhas 19, Prabhas Movie Launch, Prabhas weight

Sujeeth wraps up script work for Prabhas Movie. But, Weight lost delay for the movie. The regular shooting will commence in April and Prabhas is likely to join the sets in May.

ప్రభాస్ ఎందుకింత లేటు చేస్తున్నాడు?

Posted: 02/04/2017 05:12 PM IST
Prabhas sujeeth movie delay

బాహుబలి లాంటి సుదీర్ఘ అద్యయనం నుంచి నిష్క్రమించిన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నెక్ట్స్ సినిమా ప్రారంభం చేయడానికి ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు. మూడేళ్లుగా తన కోసమే వెయిటింగ్ లో ఉన్న సుజిత్ ను ఎందుకు ఇలా అలానే ఉంచుతున్నాడు. కొంపదీసి కొత్త ప్రాజెక్టుకు కమిట్ అవుతున్నాడా? ఇది గత కొద్దిరోజులుగా ఫిల్మ్ నగర్ లో జరుగుతున్న డిస్కషన్. అయితే దీనిపై ఇప్పుడు ఓ క్లారిటీ లభించింది.

నిజానికి సుజిత్ ఈ మూడేళ్లలో కథను పూర్తిగా కంప్లీట్ చేయలేదు. మూడేళ్ల క్రితమే స్టోరీ లైన్ అనుకున్నప్పటికీ, దానిని పూర్తిగా మాత్రం డెవలప్ చేయలేదు. బాహుబలి-2 షూటింగ్ చివరి దశకు చేరుకున్న సమయంలోనే కథను పూర్తిగా రాసేసుకున్నాడంట. ఇందుకోసం ఎప్పటికప్పుడు ప్రభాస్ తో టచ్ లోనే ఉంటూ స్టోరీని డెవలప్ చేశాడీ రన్ రాజా రన్ డైరక్టర్. ప్రస్తుతం పక్కా స్క్రిప్ట్ తో రెడీగా ఉన్నాడు కూడా. ఇక ప్రభాస్ విషయానికొస్తే.. బాహుబలి కంటే పార్ట్ 2 కోసమే భీభత్సంగా వెయిట్ పెరిగాడు కదా. ఇప్పుడు దానిని తగ్గించే పనిలో ఉన్నాడు.

సుజిత్ తో తీయబోయేది స్టైలిష్ ఎంటర్ టైనర్ కావటంతో మాంచి ఫిజిక్ లుక్కుతో కనబడాలి. ఇందుకోసం కనీసం రెండు నెలల టైం పట్టే అవకాశం ఉంది. దీంతో మే నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. బాలీవుడ్ నటుడు నీల్ నితిన్ ముఖేష్ ఓ కీలకపాత్ర పోషించబోతున్నాడని టాక్. భారీ బడ్జెట్ తో మూడు భాషల్లో (తెలుగు, తమిళ్ మరియు హిందీ) ఒకేసారి తెరకెక్కబోతుందీ చిత్రం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Prabhas  19th Movie  Director Sujeeth  Delay  

Other Articles