ప్రభాస్ రానా కోసం చేసిన పెద్ద సాయం అదే! | Huge price for Ghazi Overseas Rights.

Prabhas behind ghazi overseas business

UV Creations, Ghazi Overseas Rights, Rana Ghazi Movie, Ghazi Movie, Ghazi Prabhas, Ghazi UV Creations, Ghazi Release Date, Ghazi The Attack, Ghazi Movie Release Date, Ghazi Movie Prabhas, Prabhas Help Rana Ghazi

UV Pays Handsome Price for Ghazi Overseas Rights. UV Creations, which is known as Prabhas' production company, is also distributing movies. The company has now bought the overseas rights of Rana's "Ghazi" for a whopping price. So far, Rana's hit in overseas is "Baahubali". He has not yet proved his mettle with a solo hero movie in overseas market. Still, UV Creations bagged the rights of this movie for a handsome amount of Rs 2 Cr.

ఘాజీ కోసం ప్రభాస్ ఏం చేశాడంటే...

Posted: 02/01/2017 03:04 PM IST
Prabhas behind ghazi overseas business

ఇప్పుడున్న యంగ్ హీరోలతో టాలీవుడ్ హంక్ హీరో రానా ఎంతగా క్లోజ్ నెస్ మెయింటెన్ చేస్తాడో తెలియందీ కాదు. ఒక్క తెలుగులోనే కాదు, బాలీవుడ్, కోలీవుడ్ లో కూడా ఇతగాడికి సాయం చేసేందుకు స్టార్లంతా ఎప్పుడూ రెడీగా ఉంటారు. ఇక బాహుబలిలో భల్లాలదేవుడిగా మెస్మరైజ్ చేసి నేషనల్ వైడ్ గా మంచి గుర్తింపునే పొందాడు. బేసిక్ గా గుడ్ బాయ్ మార్క్ ఉండటం మూలంగానో ఏమో బిగ్ బీ, చిరు లాంటి
దిగ్గజాలు అతని సినిమాకు వాయిస్ ఓవర్ ఇచ్చేందుకు ముందుకు వచ్చారు.

ఇక మరోవైపు బాహుబలి షూటింగ్ సమయంలో అయితే ప్రభాస్-రానాల బంధం ఎంతగా పెనవేసుకుపోయిందో ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. ఐదేళ్లు ఒకే ప్రాజెక్టులో పనిచేయటం మూలంగా ఇంట్లో మనుషులుగా మారిపోయారు. అందుకే తన బెస్ట్ ఫ్రెండ్ సినిమా కోసం ఏదైనా చేయాలనుకున్న ప్రభాస్ ఓ నిర్ణయానికి వచ్చేశాడు. అందుకే ఘాజీ ఓవర్సీస్ హక్కుల్ని తన ఫ్రెండ్స్ బ్యానర్ అయిన యూవీ చేత కొనుగోలు చేయించాడు. అది కూడా 2 కోట్ల రికార్డు ప్రైస్ కు కావటం విశేషం. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఘాజీ ని  వాళ్లే రిలీజ్ చేయనున్నారు. 

మాములుగా అయితే రానాకు సోలో సినిమా బిజినెస్ ఇంత జరిగినా దాఖలాలు లేవు. కేవలం ప్రభాస్ రికమండేషన్ మీదే ఇలా యూవీ రంగంలోకి దిగింది కొనుగోలు చేసిందంట. మరోవైపు వార్ నేపథ్యంలో ఉన్న సినిమా కావటం, పైగా విజువల్ గా గ్రాండ్ గా ఉండటంతో ఈ సాహసం చేసిందని తెలుస్తోంది. సంకల్ప్ రెడ్డి తెరకెక్కించిన ఫిబ్రవరి 17న ఘాజీ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ghazi Movie  Rana  Prabhas  UV Creations  

Other Articles