దిల్ రాజుకు కోలుకోలేని షాక్ ఇచ్చిన శతమానం భవతి | Dil Raju Shocks with Shatamanam Bhavathi Collections.

Dil raju full happy with shatamanam bhavati collections

Shatamanam Bhavati, Shatamanam Bhavati Collections, Shatamanam Bhavati Dil Raju, Shatamanam Bhavati Profits, Shatamanam Bhavati Oscar Library, Shatamanam Bhavati Poducer, Shatamanam Bhavati Sankranti Winner, Shatamanam Bhavati Nizam Collections

Dil Raju Full Happy with Shatamanam Bhavati Collections. In his Carrier he earns huge profit with this film only.

శతమానం భవతి.. దిల్ రాజు ఫుల్ హ్యాపీ

Posted: 02/01/2017 03:49 PM IST
Dil raju full happy with shatamanam bhavati collections

రెండు భారీ చిత్రాల మధ్యలో వచ్చి శతమానం భవతి టాలీవుడ్ లో సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది. లో బడ్జెట్ చిత్రంగా వచ్చి ప్రతిష్టాత్మక ఆస్కార్ లైబ్రెరీలో చోటు సంపాదించుకోవటం ఒక విశేషం. అదే సమయంలో విడుదలై మూడు వారాలు కావస్తున్నప్పటికీ తెలుగు రాష్ట్రాల్లోనూ, ఓవర్సీస్ లోనూ హౌజ్ ఫుల్ కలెక్షన్లతో ఇంకా దూసుకుపోతుంది. దగ్గర దగ్గర పాతిక సినిమాలు తీసిన అనుభవం ఉన్న దిల్ రాజుకు అత్యధిక లాభాలు తెచ్చిపెట్టిన తొలి చిత్రం ఇదేనంటూ ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ సంక్రాంతి అసలైన విన్నర్?

బ్లాక్ బస్టర్లు, సూపర్ హిట్లు కూడా దిల్ రాజుకు అందించలేనంత లాభాలను ఈ చిత్రం సంపాదించిపెట్టిందంట. తొలి పది రోజుల్లో 25 కోట్లు రాబట్టిన ఈ చిత్రం, ఇప్పటికీ కొన్ని ఏరియాల్లో ఇప్పటికీ అదే ఊపును కొనసాగిస్తుండటం విశేషం. అ శతమానం భవతి లెక్కలను ఓసారి పరిశీలిస్తే దిల్ రాజు తనకు బాగా పట్టు ఉన్న ఏరియాలైన నైజాం, వైజాగ్ లో తానే సొంతగా రిలీజ్ చేసుకుని, మిగతా ఏరియాల్లో అమ్మేసుకున్నాడు.

ఇక రెండు ఏరియాల్లో ‘శతమానం భవతి’ మామూలు వసూళ్లు రాబట్టలేదు. నైజాంలో అనూహ్యంగా రూ.10 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ తెచ్చిపెట్టింది ఈ సినిమా. వైజాగ్ ఏరియాలోనూ ఇదే రీతిలో పెర్ఫామ్ చేసింది. అక్కడ దగ్గర దగ్గర రూ.5 కోట్ల షేర్ మార్కుకు చేరువగా ఉంది అంటే ఈ రెండు ఏరియాలతో వచ్చిన రూ.15 కోట్ల షేర్ రాజుకు ప్రత్యక్షంగా దక్కిన లాభం. ఇదిగాక ఆడియో హక్కులు, శాటిలైట్ రైట్స్ చాలా ఈజీగా 5 కోట్లకు అమ్ముడు పోయి ఉంటాయి. ఈ లెక్కన సుమారు 20 కోట్లు రాజుగారి ఖాతాలోకి వచ్చి చేరాయి. బహుశా తన గత చిత్రాల్లో దేనికి కూడా ఇంత లాభాలను దిల్ రాజు చూసి ఉండడని ట్రేడ్ పండితుల అభిప్రాయం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Shatamanam Bhavati  Dil Raju  Collections  

Other Articles

Today on Telugu Wishesh