రవితేజ ఫస్ట్ టైం ఫ్యామిలీతో ఇలా... | Raviteja Family Pic goes Viral.

Ravi teja perfect family selfie

Ravi Teja, Mass Raja Ravi Teja, Hero Ravi Teja Family Selfie, Ravi Teja Perfect Family Selfie, Hero Ravi Teja Rare Pic, Ravi Teja Family, Hero Ravi Teja Kids, Ravi Teja Rare Photos

Raviteja Upload his Family Se life in Facebook Account.we can see Ravi Teja with his entire family. The star, his wife and his two kids, they all can be seen here. These are rare images from the star and hence it is all the more special.

రవితేజ ఫ్యామిలీ సెల్ఫీ తెగ వైరల్ అవుతోంది

Posted: 01/31/2017 06:52 PM IST
Ravi teja perfect family selfie

గాడ్ ఫాదర్ ఎవరూ లేకపోయినా స్వశక్తితో ఇండస్ట్రీలో రాటు దేలాడు రవితేజ. అస్టిస్టెంట్ డైరక్టర్ గా, ఆపై క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, అటు నుంచి హీరోగా ఎదిగి విపరీతమైన మాస్ ఫాలోయింగ్ ను సంపాదించేసుకున్నాడు. అయితే సినిమాలలో అల్లరి చిల్లర క్యారెక్టర్ లలో సందడి చేసే ఈ మాస్ రాజా పర్సనల్ లైఫ్ లో మాత్రం లోఫ్రోఫైల్ మెయింటెన్ చేస్తుంటాడు.

సాధారణంగా పెళ్లిళ్లు ఇతరత్రా ఈవెంట్లకు ఫ్యామిలీలతో హీరోలు సందడి చేయటం చూస్తాం. కానీ, రవితేజ అలా కాదు. ఎప్పుడూ అతని కుటుంబాన్ని కెమెరా ముందుకు తెచ్చే ప్రయత్నం చేయడు. దీంతో తన స్వేచ్ఛకు కుటుంబం అడ్డుపడకూడదనే రవితేజ ఇలా ప్రవర్తిస్తున్నాడంటూ గతంలో విమర్శలు కూడా వినిపించాయి.

అలాంటి రవితేజ ఫస్ట్ టైం తన ఫ్యామిలీ ఫోటోను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశాడు. భార్య, కూతురుతోపాటు, కొడుకును కూడా పరిచయం చేస్తూ ఓ ఫోటోను తన ఫేస్ బుక్ అకౌంట్ లో ఉంచాడు. దీంతో ఆయన అభిమానులు హ్యాపీగా ఫీలవుతున్నారు. మాస్ హీరో ఫర్ ఫెక్ట్ ఫ్యామిలీ సెల్పీ అంటూ మురిసిపోతున్నారు. ఇక సినిమాల గురించి ఏడాదిన్నర తర్వాత గ్యాప్ తో వరుసగా రెండు బ్యాక్ టూ బ్యాక్ ప్రాజెక్టులతో వచ్చేందుకు ఫుల్ ఫాంలో ఉన్నాడు రవితేజ. అందులో ఒకటి రాజా దిగ్రేట్ కాగా, మరోకటి టచ్ చేసి చూడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mass Raja  Ravi Teja  Family  Selfie  

Other Articles