కాబిల్ కలెక్షన్లపై షారూఖ్ ఎటకారం చూశారా? | SRK unfazed by Rakesh Roshan’s allegations.

Srk satires on kaabil collections

Shah Rukh Khan, Kaabil Raees Collections, Shah Rukh Khan Hritik Roshan, Rakesh Roshan SRK, Shah Rukh Khan Rakesh Roshan, SRK love to Hritik, Raees kaabil

Sharukh Khan despite all the mudslinging, maintains that he loves and respects Hrithik and Rakesh Roshan and wishes the best for them. “Personally, I have huge amount of respect for Rakesh Roshan and Hrithik. I love them and I wish them the best. I think their film is doing good enough, they should be happy,” said Shah Rukh.

కాబిల్ కలెక్షన్లపై మళ్లీ సెటైర్ వేశాడు

Posted: 01/31/2017 05:29 PM IST
Srk satires on kaabil collections

బాలీవుడ్ హిస్టరీలోనే రాయిస్, కాబిల్ రిలీజ్ పెట్టిన చిచ్చు రానున్న రోజుల్లో మరిన్ని చిత్రాలపై పడేలా కనిపిస్తోంది. గత కొంత కాలంగా పెద్ద సినిమాలు ఒకేసారి విడుదల కాకుండా కాస్త గ్యాప్ ఇచ్చి వస్తూ కలెక్షన్లు కుమ్ముకుంటున్న విషయం తెలిసిందే. అయితే ఈ రెండు బడా చిత్రాలు మాత్రం ఒకేరోజు విడుదలవ్వటం, అయినా థియేటర్ల పంపకం విషయంలో గోల్ మాల్ జరగటం, కాబిల్ నిర్మాత రాకేష్ రోషన్ అయితే ఇది అన్యాయం అంటూ నిర్మాణ రంగం నుంచి వెళ్లిపోతానంటూ బెదిరించేస్థాయికి పరిస్థితులు చేరుకున్నాయి.

నిజానికి హృతిక్ రోషన్ సినిమా ‘కాబిల్’ ఏడాది కిందటే రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. కానీ గత ఏడాదే రావాల్సిన షారుఖ్ ఖాన్ మూవీ ‘రయీస్’ అనుకోకుండా వాయిదా పడి.. ‘కాబిల్’తో పోటీకి దిగింది. దీనిపై హృతిక్.. ‘కాబిల్’ నిర్మాత అయిన రాకేష్ రోషన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రాకేష్ అయితే.. థియేటర్ల కేటాయింపులో షారుఖ్ మోసం చేశాడని.. దీని వల్ల తనకు రూ.150 కోట్ల దాకా ఆదాయంలో కోత పడుతోందని అన్నాడు.

కట్ చేస్తే కాబిల్ కు ఎంత మంచి టాక్ వచ్చినా.. కలెక్షన్లు మాత్రం షారుఖ్ మూవీకే బాగా వచ్చాయి. అల్రెడీ రాయిస్ ఇండియా వరకే రూ.100 కోట్ల మార్కును దాటేసింది. విదేశాల్లో రూ.50 కోట్లకు పైనే వసూలు చేసింది. కానీ ‘కాబిల్’ ఇండియాలో రూ.60 కోట్లు.. విదేశాల్లో పాతిక కోట్లు మాత్రమే వసూలు చేసింది. ‘రయీస్’ రాకపోయి ఉంటే కచ్చితంగా ‘కాబిల్’ కలెక్షన్లు మెరుగ్గా ఉండేవి. ఈపాటికే ఇండియా వసూళ్లు రూ.100 కోట్లకు చేరువై ఉండేవి.

దీనిపై షారూఖ్ స్పందిస్తూ... వ్యక్తిగతంగా నాకు హృతిక్, రాకేష్ రోషన్ లంటే చాలా ఇష్టం. వారిద్దరికీ ఆల్ ది బెస్ట్ కూడా చెప్పాను. నాకు తెలిసి వారి సినిమా మంచి బిజినెస్ చేసి ఉంటుందని, ఆ లాభాలు వారికి చాలని అనుకుంటున్నాను అంటూ తెలిపాడు. మొత్తానికి రాకేష్ అండ్ హృతిక్ లకు రాయిస్ తోపాటు, తన వ్యాఖ్యలతోకూడా పెద్ద పంచే ఇచ్చాడు బాద్ షా.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Shah Rukh Khan  Raees  Kaabil  Collections  

Other Articles