రొమాంటిక్ మూడ్ లో కూడా యుద్ధం చేస్తారంట ! | Baahubali & Devasena get ready for war.

New poster of baahubali the conclusion is out

Baahubali 2 New Poster, Baahubali Devasena, Amarendra And Devasena, Baahubali: The Conclusion Poster, Baahubali New Poster, Baahubali Devasena War Poster

Baahubali 2 new poster: Behold the mighty Baahubali Sr and the beautiful Devasena.

పిక్ టాక్ : బాహుబలి-దేవసేన యుద్ధానికి సిద్ధం

Posted: 01/27/2017 08:50 AM IST
New poster of baahubali the conclusion is out

ఇండియా మొత్తం ఎంతో ఆత్రంగా ఎదురుచూస్తున్న సినిమా బాహుబలి ది కంక్లూజన్. బాహుబలి సిరీస్ లో రెండోది చివరిది అయిన బాహుబలి: ది కంక్లూజన్ ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా జరుగుతున్నాయి. ఏప్రిల్ 28న రిలీజ్ డేట్ ను ముందుగానే అనౌన్స్ చేయగా.. విడుదలకు ఇంకా 3 నెలల సమయం ఉంది. ఇదే టైంలో ప్రమోషన్స్ ను కూడా చేసుకోవాల్సి ఉంటుంది.

ఇక గణతంత్ర్య దినోత్సవం సందర్భంగా నిన్న టీం ఓ స్పెషల్ పోస్టర్ ను వదిలింది. అమరేంద్ర బాహుబలి.. దేవసేన పాత్రలు ఉన్న అందులో ఉన్నాయి. మూడేసి బాణాలను ఎక్కుపెట్టిన ఈ స్టిల్ అద్భుతంగా వుంది. ఇంతవరకూ వచ్చిన పోస్టర్స్ లో ది బెస్ట్ గా చెప్పుకోవచ్చు. స్లిమ్ అవతారంలో ఉన్న అనుష్క, మ్యాన్లీ లుక్కుతో ఉన్న ప్రభాస్ రొమాంటిక్ మూడ్ లోనే యుద్ధానికి సై అన్నట్లు ఉందా పోస్టర్. ఇక మరోవైపు హిందీ వెర్షన్ విషయంలో ఇప్పటివరకూ ఉన్న ఓ డౌట్ పై ఇప్పుడు క్లారిటీ వచ్చేసింది.

బాహుబలి కి రేటు బాగా ఎక్కువ చెప్పడంతో.. రెండో భాగాన్ని కరణ్ జోహార్ కొనలేదనే టాక్ వినిపించింది. అయితే.. తాజాగా విడుదలైన బాహుబలి ది కంక్లూజన్ హిందీ వెర్షన్ పోస్టర్ ను స్వయంగా ట్వీట్ చేశాడు కరణ్ జోహర్. 'బాహుబలి నుంచి మరో అద్భుతమైన దృశ్యం. ఏప్రిల్ లో రిలీజ్ కానుంది' అంటూ ట్వీట్ చేసిన కరణ్ జోహార్.. హిందీ వెర్షన్ కి సంబంధించిన పోస్టర్ ని ట్వీట్ చేశాడు. ఇందులో ధర్మ ప్రొడక్షన్స్.. ఏఏ మూవీస్ అనే బ్యానర్లతో పాటు.. కరణ్ జోహార్ అండ్ ఏఏ ఫిలిమ్స్ ప్రెజెంట్స్ అంటూ నేమ్ కార్డ్స్ వేసేయటంతో రూమర్లకు చెక్ పడినట్లయ్యింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Baahubali The Conclusion  Republic day poster  Amarendra Baahubali  Devasena  

Other Articles