శ్రీదేవి మామ్ కి కూడా వాళ్లు చుక్కలు చూపిస్తారా? | Pakistan actors trouble for sridevi Mom.

Pak actors granted visas for sridevi movie

Actress Sridevi, Sridevi Mom Movie, Sajal Ali Adnan Siddiqui, Sridevi Adnan Siddiqui, Sajal Ali Sridevi, Sridevi Pakistani Actors, MNS Mom Movie, Sridevi Mom Movie Shooting

Even though ban Actress Sridevi Mom movie contains Pakistani actors in Key role. actors Sajal Ali, who plays Sridevi's daughter in the film, and Adnan Siddiqui, who plays her husband. Reportedly, the film's woes are over, as the two actors have been granted visas and will return to the country to complete the film.

శ్రీదేవి కోసం ‘పాక్’ నటులకు వీసాలు

Posted: 01/24/2017 10:41 AM IST
Pak actors granted visas for sridevi movie

బాలీవుడ్ పై యూరీ దాడి తీవ్ర ప్రభావంను చూపిన విషయం తెలిసిందే. పాకిస్థాన్ నటులపై బ్యాన్వ విధిస్తూ... వారిని తీసుకుంటే తీవ్ర చర్యలుంటాయని మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన చీఫ్ ఉద్ధవ్ థాక్రే ప్రకటించటం, ఆపై యే దిల్ హై ముష్కిల్ విషయంలో నెలకొన్న వివాదం తెలిసిందే. తన సినిమాను అడ్డుకోవటంతో చివరకు కరణ్ జోహర్ ఏడ్చినంత పని చేశాడు. స్వయానా ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ రంగంలోకి దిగి ఇరు వర్గాలతో దౌత్యం చేయటం, ఆపై సినిమా రిలీజ్ అయిపోవటం జరిగిపోయాయి.

ఇక దాని తర్వాత షారూఖ్ ఖాన్ రాయిస్ హీరోయిన్ మహీరా ఖాన్ విషయంలో వివాదం చెలరేగగా, ఆమె ప్రమోషన్ కోసం రాలేదంటూ బాద్ షా థాక్రే ఇంటికి వెళ్లి వివరణ ఇచ్చుకున్నాడు. ఇక ఇప్పుడు ప్రముఖ నటి శ్రీదేవి వంతు వచ్చింది. ఆమె ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం ‘మామ్’. ప్రముఖ నిర్మాత, ఆమె భర్త బోనీకపూర్ నిర్మిస్తున్నాడు.

ఈ చిత్రంలో పాకిస్థాన్ నటీనటులు అద్నాన్ సిద్దిఖీ, సజల్ అలీ కూడా నటిస్తున్నారు. శ్రీదేవికి భర్త గా అద్నాన్, కూతురుగా సజల్ ఆయా పాత్రలను పోషిస్తున్నారు. ఈ నేపథ్యంలో వీరికి భారత ప్రభుత్వం వీసాలు మంజూరు చేసింది. ఇప్పటికే ఎక్కువ శాతం షూటింగ్ అయిపోయిన ఈ చిత్రం వారి రాకతో అడ్డంకులు తొలగిపోయినట్లు అయ్యింది. వార్నింగ్ తర్వాత కూడా షూటింగ్ జరుపుకుంటున్న చిత్ర ఇదే కావటంతో ఇది అసలు జరిగే పనేనా అని చర్చించుకుంటున్నారు. అన్ని సజావుగా సాగితే మే లో సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది.

Pak actors in Mom Movie

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sridevi  Mom Movie  Pak Actors  

Other Articles

Today on Telugu Wishesh