ఎంగేజ్ మెంట్ డేట్ అసలు ఎవరు ఫిక్స్ చేశారు? | who confirmed Chaitu and Sam's Engagement.

Samantha naga chaitanya engagement again in news

Samantha Ruth Prabhu, Naga Chaitanya, Samantha Naga Chaitanya engagement, Akkineni Family marriage, Sam Chaitu engagement, Akkineni Nagarjuna Family, Samantha husband, Naga Chaitanya Wife, Samantha Naga Chaitanya 2017, Actress Samantha Marriage, Actress Samantha Engagement, Akkineni Nagarjuna Elder Son

Naga Chaitanya and Samantha to get engaged on January 29. But Akkineni Nagarjuna not confirmed it officially.

ఎంగేజ్ మెంట్ మళ్లీ అదే తేదీని ఫిక్స్ చేస్తున్నారు

Posted: 01/21/2017 03:56 PM IST
Samantha naga chaitanya engagement again in news

టాలీవుడ్ లో హాట్ కపుల్ గా చెలామణి అవుతున్న అక్కినేని వారసుడు నాగ చైతన్య, చెన్నై సోయగం సమంతలు ఈ యేడాది పెళ్లి పీటలు ఎక్కబోతున్న విషయం తెలిసిందే. అయితే ఎప్పుడన్న విషయంపై క్లారిటీ లేకపోయినప్పటికీ, కనీసం ఎంగేజ్ మెంట్ విషయంలో కూడా క్లారిటీ లేకుండా ఉంది ఈ జంట.

ఆ మధ్య జనవరి 29న వీరిద్దరి నిశ్చితార్థం గ్రాండ్ గా జరగబోతుందంటూ ఓ వార్త అన్ని ప్రముఖ మీడియాలో చక్కర్లు కొట్టింది. మెల్లిగా ప్రారంభమైన ఈ గాసిప్ నేషనల్ మీడియాలో కూడా హైలెట్ కావటం విశేషం. ఆ విషయంపై ఎక్కడా నోరు మెదపలేదు అక్కినేని ఫ్యామిలీ. దీంతో అది కూడా పుకారే అని అనుకున్నారు. ఇక తేదీ దగ్గర పడుతుండటంతో ఇప్పుడు మళ్లీ సేమ్ వార్త వైరల్ అవుతోంది. అదే తేదీన కేవలం ఫ్యామిలీ, బంధువుల సమక్షంలో సింపుల్ గా వీరిద్దరికి ఎంగేజ్ మెంట్ చేసేందుకు అన్ని సన్నాహాలు జరుగుతున్నాయని చెప్పుకుంటున్నారు.

ఇప్పుడు కూడా ఈ విషయంలో నాగ్ నుంచి ఎటువంటి స్పందన లేదు. కుటుంబ సభ్యులు కన్ఫర్మ్ చేశారంటున్నప్పటికీ అది ఎవరో తెలీటం లేదు. ఏది ఏమైతేనేం ఆ రోజునే ముడిపడ్డ ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. రెండేళ్లుగా డేటింగ్ చేస్తున్న ఈ జంట ఆర్నెలల క్రితం ఓపెన్ అయిపోగా, ఇరు కుటుంబాలు వాళ్ల ప్రేమకు ఎటువంటి అడ్డంకులు చెప్పలేదు. అల్రెడీ నాగ్ చిన్న తనయుడు అఖిల్ ఎంగేజ్ మెంట్ అయిపోగా, ఇక మిగిలింది చై-శామ్ నిశ్చితార్థమే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Akkiineni Nagarjuna  Samantha  Naga Chaitanya  Engagement  

Other Articles

Today on Telugu Wishesh