నాని వేలు పెట్టాడు... అందుకే ఇంత లేటు | Nani reason for Nenu Local delay.

Reason behind nenu local delay

Nenu Local Movie, Hero Nani, Nenu Local delay, Nani Nenu Local Movie, Nenu Local release date, Prasanna Kumar Nani, Nani Dil Raju, Nenu Local Climax

Reason behind Nenu Local delay reveal. Nani was not satisfied with the climax episodes and wanted it to be rewritten, writer Prasanna.

నేను లోకల్ లేట్ కి కారణం అదేనంట...

Posted: 01/21/2017 03:26 PM IST
Reason behind nenu local delay

పెద్ద సినిమాల మధ్య పోటీతో రిస్క్ చేయటం ఎందుకనో, లేక ప్రోడక్షన్ పనులు ఆలస్యం అవ్వటం మూలంగానో సినిమాలను పోస్ట్ పోన్ చేసుకునే పరిస్థితులు ఇప్పడు దాపురిస్తున్నాయి. అయితే తమ సినిమా రిలీజ్ డేట్ అల్రెడీ మూడు నెలల ముందే చెప్పేసి, అనుకున్న టైంకి షూటింగ్ కూడా పూర్తి చేసేసి కూడా రిలీజ్ ను నెలరోజుల పాటు వాయిదా వేసుకోవటం ఒక్క నాని నేను లోకల్ సినిమా విషయంలో జరిగింది. క్రిస్మస్ కే రావాల్సిన ఈ సినిమాను హఠాత్తుగా వాయిదా వేయటం వెనుక నిర్మాత దిల్ రాజు మతలబు ఏంటో ఎవరికీ అర్థం కాలేదు.

అయితే కారణం ఏంటో ఇప్పుడు బయటికి వచ్చింది. నిజానికి సినిమా క్లైమాక్స్ విషయంలో హీరో నాని బెట్టు చేయటం మూలంగానే ఆలస్యం అయ్యిందని ఓ వార్త అప్పట్లో చక్కర్లు కొట్టింది. అందులో వాస్తవం ఉన్నా... అసలు మ్యాటర్ మాత్రం వేరే అని చెబుతున్నాడు ఈ చిత్ర రైటర్ ప్రసన్న కుమార్.

గతంలో సినిమా చూపిస్త మావా చిత్రానికి ప్రసన్న డైలాగులు రాశాడు. అందుకే నేను లోకల్ కి కూడా అతన్నే తీసుకున్నాడు దర్శకుడు త్రినాథ రావు. సినిమా అనుకున్న టైంకి షూటింగ్ అయిపోయిది. డైరక్షన్ డిపార్ట్ మెంట్ లో అనుభవం ఉన్న నానికి క్లైమాక్స్ అంత సంతృప్తి కలిగించలేకపోయిందంట. ఈ విషయంలో దిల్ రాజు కూడా ముందు ప్రసన్నకే సపోర్ట్ చేశాడు. అయినా నాని ఏం ఫీల్ కాకుండా అందులో పాల్గొన్నాడు. ఎలాగోలా సినిమా షూటింగ్ అయిపోయింది. అదే సమయంలో ప్రసన్న పని చేసిన మరో చిత్రం నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్ సినిమా విడుదలైంది. కానీ, ఆ చిత్రం అట్టర్ ఫ్లాప్ అయ్యింది.

దీంతో నాని జడ్జిమెంట్ ను నమ్ముకున్న దిల్ రాజు రీషూట్ కే మొగ్గు చూపటం, అందుకే సినిమా ఆలస్యం అయిపోవటం జరిగిందంట. ఏది ఏమైతేనేం మొత్తానికి నాని పంతం నెగ్గించుకున్నాడు. మొత్తానికి ఫిబ్రవరి 3న నేను లోకల్ థియేటర్లలో సందడి చేయనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nani  Nenu Local  

Other Articles

Today on Telugu Wishesh