జల్లికట్టుకి మహేష్, పవన్ పూర్తి మద్ధతు | Pawan Kalyan Mahesh Babu Jallikattu tweets.

Tollywood super stars tweets on jallikattu

Pawan kalyan, mahesh babu, Pawan Mahesh tweets, pawan Kalyan Jallikattu, Pawan kalyan rooster fights, Mahesh babu Jallikattu tweets, Pawan Kalyan Jallikattu, Tollywood support Jallikattu, Jallikattu tweets, Pawan Mahesh support Jallikattu

Tollywood Top Heroes Pawan kalyan and Mahesh Babu tweets on Jallikattu Ban, and they support.

జల్లికట్టుపై టాలీవుడ్ టాప్ హీరోల ట్వీట్టు

Posted: 01/20/2017 11:52 AM IST
Tollywood super stars tweets on jallikattu

దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతున్న జల్లికట్టుపై ఒక్క కోలీవుడే కాదు, టాలీవుడ్ కూడా స్పందిస్తోంది. అగ్రహీరోలైన పవన్ కళ్యాణ్, మహేష్ బాబులు తమ మద్ధతును ప్రకటించారు. సాంప్రదాయకు క్రీడను బ్యాన్ చేయటం సరికాదన్న ఒపీనియన్ ను తమ సోషల్ మీడియా సైట్లో వెల్లడించారు.

ఖైదీ పై ట్వీట్ తర్వాత యాక్టివ్ గా లేని పవన్ జల్లికట్లుపై తన ట్విట్టర్ లో సందేశాలను ఉంచాడు. సంప్రదాయాలన్నా, జీవరాశి అన్నా వాటిన్నంటిని తన ఒడిలో ఇముడ్చుకున్న ప్రకృతి తల్లి అంటే తనకు ఎనలేని గౌరవమని తెలిపాడు. అంతేకాదు తన గోశాలలో 16కు పైగా పశువులు ఉన్నాయని పేర్కొంటూ గతంలో శరత్ మరార్ పోస్ట్ చేసిన ఓ పిక్ ను ఉంచాడు. వాటిని చూసే తాను జల్లికట్టు, కోడిపందాలపై స్పందిస్తున్నానని పేర్కొన్నాడు. వాటిని నిషేధించటం ముమ్మాటికీ ద్రవిడ సంస్కృతిపై దాడి చేయటమేనని, దక్షిణ భారతంపై కేంద్రం వైఖరి ఎలా ఉందో స్పష్టమౌతుందన్నాడు. ప్రజల మనోభావాలను తీవ్రంగా గాయపడ్డాయని, ఆంధ్రా, తమిళనాడులో తాను స్వయంగా ఆ పరిస్థితులను చూశానంటూ ట్వీట్ చేశాడు.

 

మిస్టర్ కూల్ గా ప్రిన్స్ మహేష్ బాబును అభివర్ణించవచ్చు. వివాదాస్పద అంశాల జోలికి వెళ్లిన దాఖలాలు లేవు. అలాంటి మహేష్... జల్లికట్టుపై ట్వీట్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. జల్లికట్టుకు మద్దతు పలుకుతున్నట్టు ట్విట్టర్ లో తెలిపాడు. తమిళుల ఐకమత్యం సంతోషాన్నిచ్చిందని తెలిపాడు. జల్లికట్టు కోసం వారి ఐకమత్యానికి తాను మద్దతు పలుకుతున్నానని చెప్పాడు. తమ సంప్రదాయాల కోసం తమిళ విద్యార్థులు చేస్తున్న ఈ పోరాటం అద్భుతమని తెలిపాడు. మహేష్ బాబు పుట్టి పెరిగింది తమిళనాడులోనే. అందుకే అతనికి తమిళ సంప్రదాయాల పట్ల పూర్తి అవగాహన ఉంది. బహుశా అందుకే మహేష్ ట్వీట్ చేసి ఉండొచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Tollywood  Pawan kalyan  mahesh babu  Jallikattu  tweets  

Other Articles

Today on Telugu Wishesh