కోలీవుడ్ హీరోలకు కమల్ స్ట్రాంగ్ వార్నింగ్ | Kamal Hassan suggests Kollywood stars about Jallikattu Protest.

Kamal hasaan comments on kollywood stars

Kamal Haasan, Jallikattu Protest, Kamal Jallikattu, Trisha support Jallikattu, Trisha PETA, Trisha Jallikattu, Kamal Haasan Kollywood Heroes, Kamal Haasan Jallikattu, Tamil Nadu youth jallikattu, AR Rahman Jallikattu

Kamal haasan speech at Jallikattu protest. Suggests Kollywood stars not credir this issue. Kamal Haasan has strongly come out in support of the sport. “If you want a ban on Jallikattu, let's also ban biryani. I'm a big fan of Jallikattu. I'm probably one of few actors who've played Jallikattu.

ఆ క్రెడిట్ మీ ఖాతాలో వేసుకోకండి: కమల్

Posted: 01/20/2017 10:44 AM IST
Kamal hasaan comments on kollywood stars

జల్లికట్టు ఆందోళన ఓవైపు తమిళనాడును వణికిస్తూనే ఉంది. నిషేధం ఎత్తివేయాలంటూ శుక్రవారం తమిళనాడు బంద్ జరుగుతోంది. సామాన్యుడి నుంచి సెలబ్రిటీల దాకా అంతా ఉవ్వెత్తున్న ఉద్యమంలో పాల్గొంటున్నారు. మరోవైపు కోలీవుడ్ కూడా సమర శంఖం పూరించి ముందుకు సాగుతోంది.

అయితే ఈ విషయమై ప్రముఖ నటుడు కమలహాసన్ నిరసనలో పాల్గొంటున్న హీరోహీరోయిన్ల ను ఉద్దేశించి సంచలన కామెంట్లు చేశాడు. రాష్ట్రంలోని యువత మొత్తం తొలిసారిగా గర్వపడే స్థాయిలో ఓ ఘన కార్యంలో తలమునకలై ఉన్నారని తెలిపారు. ఈ క్రమంలో ఆందోళనలో పాల్గొని ఆ క్రెడిట్ ను కొట్టేయాలనుకోవటం కోలీవుడ్ స్టార్లకు సముచితం కాదని తెలిపాడు. ఇది, యువకులకు దక్కాల్సిన విజయమని అన్నారు. కాబోయే రాజకీయ నాయకులు ఆ యువతలో ఉండొచ్చని, వారి పోరాటాన్ని అడ్డుకునే అర్హత ఎవరికీ లేదని కమల్ అన్నారు. దమ్ముంటే దాన్ని బ్యాన్ చేయండి

సాధారణంగా యువకులను రాజకీయ నేతలు రెచ్చగొడుతుంటారని, ఇప్పుడు మాత్రం ఆ రాజకీయనేతలే ఆశ్చర్యపోయేలా యువత రంగంలోకి దిగిందని పేర్కొన్నారు. వారి మద్ధతు ప్రకటించాలనే కానీ, రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయటం, తామే అదంతా చేస్తున్నట్లు బిల్డప్పులివ్వటం లాంటివి చేయొద్దంటూ పిలుపునిచ్చాడు. కాగా, ఇదోక విప్లవమని నటుడు విశాల్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. మరోవైపు సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ జల్లికట్టు కోసం నిరాహార దీక్షకు దిగగా, చెస్ ఛాంపియన్ విశ్వనాథన్ ఆనంద్, ఆధ్యాత్మిక గురు పండిట్ రవిశంకర్ లాంటి వాళ్లు కూడా మద్ధతు ప్రకటించారు.

త్రిష యూటర్న్...

పెటాకు మద్ధతుగా జల్లికట్టు క్రీడను వ్యతిరేకించిన హీరోయిన్ త్రిష యూటర్న్ తీసుకుంది. నాలుగు రోజులుగా చెన్న‌య్‌లోని మెరీనా బీచ్‌లో త‌మిళ ప్ర‌జ‌లు పెద్ద ఎత్తున ఆందోళ‌న‌లో పాల్గొంటున్న సంగ‌తి తెలిసిందే. మెరీనా బీచ్ కు చేరుకున్న త్రిష జ‌ల్లిక‌ట్టుపై సుప్రీంకోర్టు విధించిన నిషేధాన్ని ఎత్తివేయాల‌ని కోరింది. ఇండియాస్ యానిమ‌ల్ రైట్స్ ఆర్గ‌నైజేష‌న్ త‌ర‌ఫున జ‌ల్లిక‌ట్టుకి వ్య‌తిరేకంగా కొన్ని రోజుల క్రితం త్రిష త‌న ట్విట్ట‌ర్ అకౌంట్‌లో ఓ పోస్ట్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఆ పోస్ట్‌పై త‌మిళులు తీవ్ర స్థాయిలో మండిప‌డ‌డంతో ఆమె త‌న తీరుని మార్చుకుంది. ఇప్పుడు ఏకంగా జ‌ల్లిక‌ట్టుపై నిషేధాన్ని ఎత్తివేయాల‌ని కోరుతోంది. అయితే ఆమె సంఘీభావం తెలిపినప్పటికీ ఆందోళనకారులు మాత్రం వెనక్కి తగ్గలేదు. త్రిష ఫోటోకి దండేసి నిరసన తెలియజేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారకముందే అక్కడి నుంచి వెళ్లిపోయింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kamal Haasan  Jallikattu  protest  Kollywood  

Other Articles