రాశీ పేరు చెప్పగానే కన్ఫర్మ్ చేసేశాడా? | Rashi Khanna pair up with NTR.

Jai lava kusha one female lead confirmed

Rashi Khanna, Junior NTR, NTR Bobby Movie, Rashi Khanna NTR, NTR Rashi Khanna, Rashi Jai Lava Kusha, Rashi Khanna 2017 movies, Rashi Khanna in Bobby Movie, Jai Lava Kusa heroines, Rashi khanna Jai Lava Kusa

NTR's upcoming film 'Jai Lava Kusha' under Bobby direction have been searching for the suitable cast of the film for the past couple of days. The latest we heard is that chubby and bubbly heroine Rashi Khanna has been roped in as one of the female leads of the film. Two more heroines are yet to join the film's cast.

లేట్ అయినా మంచి ఛాన్స్ కొట్టేసింది

Posted: 01/20/2017 09:46 AM IST
Jai lava kusha one female lead confirmed

ఎన్టీఆర్ తన 27వ చిత్రం కోసం రంగం సిద్ధం చేసేసుకున్నాడు. పవర్ ఫేం బాబీ దర్శకత్వంలో అన్న కళ్యాణ్ రామ్ నిర్మాతగా జై లవకుశ లో నటించేందుకు సిద్ధమైపోతున్నాడు. ఫిబ్రవరి రెండో వారంలో చిత్రం షూటింగ్ అదికారికంగా కూడా ప్రారంభం కాబోతుంది. ఇంతలో సినిమాకు సంబంధించిన మరో అప్ డేట్ వచ్చింది.

ఈ సినిమాలో ఎన్టీఆర్ త్రిపాత్రిభినయం చేయబోతున్నాడని చెప్పుకుంటున్నారు. ఇందుకుగానూ ముగ్గురు హీరోయిన్ల అవసరం ఉంటుంది. అందులో ఒక రోల్ కి బబ్లీ బ్యూటీ రాశీఖన్నాను ఎంపికచేసినట్లు తెలుస్తోంది. టాలెంటెడ్ బ్యూటీ కావటంతో ఎన్టీఆర్ కూడా ఫైనలైజ్ చేయమని వెంటనే చెప్పేశాడంట. మరో ఇద్దరు హీరోయిన్ల ఎంపిక కూడా త్వరలోనే జరగబోతుంది. కంప్లీట్ అవుట్ అండ్ అవుట్ యాక్షన్ కమ్ కామెడీ ఎంటర్ టైనర్ గా బాబీ లవకుశను తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది.

ఇక తన కెరీర్ లో ఇప్పటిదాకా రాశీ స్టార్ హీరోతో చేసిందే లేదు. ఫస్ట్ టైం ఎన్టీఆర్ తో జోడీ కట్టడం ద్వారా ఓ బిగ్ ప్రాజెక్టులో ఛాన్సు దక్కించుకున్నట్లు అయ్యంది. అంతేకాదు రాంచరణ్-సుకుమార్ సినిమాకు గానూ అడిషన్ చేయించుకున్న ఈ బ్యూటీ ఆ సినిమాకు కూడా ఫైనలైజ్ అయినట్లు తెలుస్తోంది. ఆ ప్రాజెక్టుపై కూడా త్వరలోనే అఫీషియల్ అనౌన్స్ మెంట్ రానుంది. చూస్తుంటే రాశీఖన్నాకు 2017 గ్రాండ్ టర్న్ ఇచ్చేలానే ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rashi Khanna  Junior NTR  Jai Lava Kusa  Bobby  

Other Articles

Today on Telugu Wishesh