నటసింహం వారసుడి ఎంట్రీకి నిర్మాత ఇతనే.! sai korrapati confirms mokshagna’s debut

Sai korrapati confirms mokshagna s debut

sai korrapati, producer, mokshagna, mokshagna,’s debut movie, Gautamiputra Satakarni, tollywood, cinema, Telugu cinema, entertainment

Nandamuri Balakrishna’s son Mokshagna’s movie debut has been much anticipated topic in Telugu Film Industry in the past few months.

నటసింహం వారసుడి ఎంట్రీకి నిర్మాత ఇతనే.!

Posted: 01/13/2017 04:10 PM IST
Sai korrapati confirms mokshagna s debut

నందమూరి నటవారస వృక్షానికి మరో కొమ్మ. నటసింహం బాలకృష్ణ వారసుడిగా ఆయన తనయుడు మోక్షజ్ఞ సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇవ్వనున్న సంగతి తెలిసిందే. బాలకృష్ణ వందో సినిమాలోనే మోక్షజ్ఞ అతిథి పాత్రలో కనిపిస్తాడంటూ ప్రచారం జరిగినా.. కథా పరంగా కుదరకపోవటంతో విరమించుకున్నారు. అయితే తాజాగా మోక్షజ్ఞ లాంచింగ్ సినిమాను తానే నిర్మిస్తున్నట్టుగా ప్రకటించాడు నిర్మాత సాయి కొర్రపాటి.

పలు సక్సెస్ఫుల్ చిత్రాలతో అభిరుచి గల నిర్మాతగా పేరు తెచ్చుకున్న సాయి కొర్రపాటి, బాలకృష్ణకు అత్యంత సన్నిహితుడు. అందుకే మోక్షజ్ఞను పరిచయం చేసే బాధ్యతను సాయికి అప్పగించాడు బాలయ్య. ప్రస్తుతానికి మోక్షజ్ఞ హీరోగా చేయబోయే సినిమా కోసం కథ ఎంపిక చేసే పనిలో ఉన్నారు నిర్మాత. వారాహి చలన చిత్ర బ్యానర్లో తెరకెక్కనున్న ఈ సినిమాను ఎప్పుడు ప్రారంభించేది మాత్రం సాయి కొర్రపాటి ప్రకటించలేదు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles