వెంకీకి ఎందుకంత బలుపు...? | venky as arrogant boxing coach in Guru teaser.

Guru new teaser released

Venkatesh Guru movie, Guru movie new teaser, Guru movie teaser, Venkatesh Arrogant avatar, Venkatesh Guru, Guru telugu movie

Victory Venkatesh Guru movie new teaser released.

గురు కొత్త టీజర్ వచ్చేసింది

Posted: 01/11/2017 05:39 PM IST
Guru new teaser released

వెంకీ కొత్త సిినిమా గురు న్యూ టీజర్ ఇవాళ రిలీజ్ అయ్యింది. తన ఫేస్ బుక్ పేజీలో వెంకీ దానిని రిలీజ్ చేశాడు. బాక్సింగే తన ప్రపంచమని గురు టీజర్‌లో విక్టరీ వెంకటేశ్‌ అంటున్నారు. పొగరుబోతు బాక్సింగ్ కోచ్ గా వెంకీ విశ్వరూపం చూపించాడు.

అమ్మాయిలను కొడుతూ, ట్రైనింగ్ ఇస్తూ.. మధ్యలో అడ్డుకునేందుకు యత్నించిన నాజర్ పై ‘‘చెప్పింది చేయకపోతే నీలా బాత్ రూంలు కడుక్కుంటారంటూ’’ సైటైర్ వేస్తూ ఇలా సాగిపోయింది. మీరు నేను చెప్పిందే వింటారు.. చెప్పిందే తింటారు. ఇల్లు, వాకిలి, ప్రేమ, దోమ, చెత్తాచెదారం అన్ని పక్కనపెట్టి ఒళ్లొంచి ట్రై చేయండి అని టీజర్‌లో వెంకీ చెప్పే డైలాగ్‌ ఆకట్టుకుంటుంది. ఏది ఏం జరిగినా గోల్ ను రీచ్ అయ్యే విద్యార్థులే లక్ష్యంగా శ్రమించే కోచ్ అవతారంలో వెంకీ దుమ్ముదులపబోతున్నాడని అర్థమౌతోంది.  యూట్యూబ్‌లో విడుదలైన ఈ టీజర్‌ ట్రెండింగ్ మారిపోయింది.

 

ఈ చిత్రం వెంకీ సినీ కెరీర్‌లో పెద్ద హిట్‌గా నిలుస్తుంది, వెంకీ ఈజ్‌ బ్యాక్‌, సూపర్‌ వెంకీ సర్‌, చక్కగా ఉంది, చిత్రం కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నాం.. అని ఫ్యాన్స్‌ యూట్యూబ్‌లో కామెంట్స్‌ చేశారు. సాలా ఖడూస్‌ అనే బాలీవుడ్‌ చిత్రానికి రీమేక్‌గా సుధ కొంగర ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. సంతోష్‌ నారాయణన్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. ఒకే రోజు బాబాయ్ అబ్బాయి(రానా ఘాజీ) ల టీజర్, ట్రైలర్ లు రావటంతో దగ్గుబాటి అభిమానులు ఫుల్ ఖుషీలో మునిగిపోయారు.

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Venkatesh  Guru movie  new teaser  

Other Articles

Today on Telugu Wishesh