మెగా సర్జికల్ స్ట్రైక్స్.. కాస్తుంటే బాహుబలి రికార్డు బ్రేకయ్యేదే | Megastar Overseas Record Opening Collections.

Khaidi no 150 movie firstday overseas collections

Khaidi No 150, Overseas first day, Khaidi overseas collection, Khaidi No 150 Baahubali, Khaidi first day collections, Khaidi No 150 collections, Khaidi No 150 Rajamouli tweet, Khaidi No 150 Rajamouli, Khaidi No 150 Allu Arjun, Khaidi No 150 Director tweets, Khaidi No 150 Rajamouli thanks, Khaidi No 150 firstday report

Phenomenal record of Khaidi No 150 in Overseas first day.

ప్రీమియర్ షోలతోనే చిరు రఫ్ఫాడించాడు

Posted: 01/11/2017 03:51 PM IST
Khaidi no 150 movie firstday overseas collections

ఊహించిందే జరుగుతోంది. ఖైదీ ప్రభంజనం మొదలైపోయింది. బాస్ ఈజ్ బ్యాక్ రీఎంట్రీతోనే బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్నాడు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ కన్నా ముందే ఓవర్ సీస్ లో ఖైదీ నంబర్ 150 ప్రీమియర్ షోస్ పడిపోయాయి. ముఖ్యంగా తొమ్మిదేళ్ల తరువాత తమ అభిమాన నటుణ్ని హీరోగా తెర మీద చూసేందుకు అభిమానులు క్యూ కట్టారు. దీంతో అన్ని ప్రీమియర్ షోస్ పూర్తి కాకముందే ఖైదీ నంబర్ 150 మిలియన్ మార్క్ ను దాటేసింది.

అమెరికాలోని 123 లొకేషన్స్ లో రిలీజ్ అయిన ఖైదీ, 1,133,615 డాలర్లకు పైగా వసూళు చేసింది. ఖైదీ కన్నా ముందు 1.36 మిలియన్ డాలర్లతో ఒక్క బాహుబలి మాత్రం తొలి రోజు ఓవర్ సీస్ లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డ్ లో ఉంది. ప్రీమియర్స్ షోస్ అన్ని పూర్తయ్యే వరకు ఇదే జోరు కొనసాగితే బాహుబలి రికార్డ్ ను ఖైదీ నంబర్ 150 క్రాస్ చేసే ఛాన్స్ ఉందంటున్నారు విశ్లేషకులు. తెలుగు సీనియర్ హీరోల్లో నాగార్జున తరువాత మిలియన్ మార్క్ సాధించిన హీరో చిరునే కావటం విశేషం.

ఈ విషయాన్ని అభిమానులతో పాటు సినీ ప్రముఖులు కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఖైదీ నెం 150 సినిమా గురించి ట్వీట్ చేసిన అల్లు అర్జున్.. ''లెట్స్ డూ రికార్డ్స్ కుమ్ముడు'' అంటూ వ్యాఖ్యానించారు. పైగా ట్రెండ్ చూస్తుంటే.. బాహుబలి ప్రీమియర్ కలక్షన్ రికార్డులను ఇప్పుడు చిరంజీవి తిరగరాస్తారని అనిపిస్తోంది. # మెగా సర్జికల్ స్ర్టయిక్.

మరోవైపు దర్శకులు కూడా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. స్టార్ దర్శకుడు రాజమౌళి, డైరక్టర్లు హరీష్ శంకర్, మారుతిలు గ్రాండ్ రీఎంట్రీకి సలాం అంటూ ట్విట్టర్ లో ట్వీట్లు చేశారు. ఇక సినిమాను తిలకించిన చిరు తల్లి అంజనా దేవీ 60 ఏళ్ల వయసులో తన కుమారుడు అలరించాడని, అభిమానులకు ముందే సంక్రాంతి పండగ తెచ్చాడని వ్యాఖ్యానించటం విశేషం. ప్రస్తుతం ఎక్కడా చూసిన ఖైదీ గురించి, దాని రికార్డుల బ్రేకింగ్ గురించే మాట్లాడుకుంటున్నారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Khaidi No 150  Rajamouli  Chiranjeevi  overseas collection  

Other Articles

Today on Telugu Wishesh