ఓంపురి మరణంపై పాక్ కథనాలు.. నవ్వాలో, ఏడ్వాలో తెలీటం లేదు | Pakistan media Claims Modi Murdered Om Puri.

Pakistan tv channel says modi behind om puri death

Pakistan Media, Bol TV, Aisay Nahin Chalega, Om Puri Death, Narendra Modi and Ajith Doval, Om Puri Murdered, Modi Om Puri, Om Puri Pak media, Pakistan Channel Om Puri death, Pak on Om puri death, Om Puri murder, Om Puri death, Bol TV Om Puri, Om Puri heart attack

Pakistani News channel claims PM Modi and Ajit Doval murdered Om Puri: Salman and Fawad are next.

ఓంపురి మరణం వెనుక ప్రధాని ఉన్నాడా?

Posted: 01/10/2017 08:15 AM IST
Pakistan tv channel says modi behind om puri death

వెటరన్ నటుడు ఓం పురి ఈ నెల 6న గుండె పోటుతో మృతి చెందిన విషయం తెలిసిందే. ఓవైపు దేశంలోని నటీనటులంతా ఆయన నిష్క్రమణపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తుంటే, ఓ ఛానెల్ వారు మాత్రం షాకింగ్ ఆరోపణలకు దిగారు. ఓంపురిది స‌హజ మ‌ర‌ణం కాదని, ఆయ‌న‌ను హ‌త్య చేశారన్నదే వారి ఆరోపణ. ఇంతకీ ఈ ప్రేలాపణ చేస్తోంది ఎవరో కాదు.. పాకిస్థాన్‌కు చెందిన బోల్‌టీవీ అనే చాన‌ల్‌.

అవును... అసలు ఓంపురి హ‌త్య వెన‌క ఉన్నది ఎవరన్నది వారి ఆరోపణో తెలుసా? దేశ ప్రధాని నరేంద్ర మోదీ హ‌స్తం ఉంద‌ని ఆరోపించింది. విషయం ఏంటంటే... యూరి దాడి తర్వాత పాకిస్థాన్ క‌ళాకారుల‌ను భారత్ లో బ్యాన్ చేశాయి కొన్ని వర్గాలు. ఆ సమయంలో ఓంపురి పాక్ కళాకారులకు మ‌ద్ద‌తు ప‌లికి వివాదంలో చిక్కుకున్నాడు. ఆ కామెంట్లను జీర్ణించుకోలేని మోదీ ఓంపురిని చంపించారంటూ ఒక హాస్యాస్ప‌ద క‌థ‌నాన్ని సదరు ఛానెల్ ప్రసారం చేసింది. అంతేకాదు పురి మృతి వెన‌క మోదీతోపాటు, జాతీయ భ‌ద్ర‌తా స‌ల‌హాదారు అజిత్ దోవ‌ల్ హ‌స్త‌ముంద‌ని తెలిపింది. 'ఐసీ నహీ చ‌లేగా' అనే క‌థ‌నంలో సదరు ఛానెల్ ఈ ఆరోపణలు చేసింది. ఇది కూడా చదవండి... నటఝరి హఠాన్మరణం

త‌న వ‌ద్ద‌కు రావాల్సిందిగా దోవ‌ల్ ఇటీవ‌ల ఓంపురికి క‌బురు పెట్టార‌ని పేర్కొన్న చాన‌ల్ ఆయ‌న ఇంటికి రాగానే పీక‌ల‌దాకా మ‌ద్యం తాగించారని , సైనికుల‌పై తాను చేసిన వ్యాఖ్య‌ల‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్పాలంటూ ఆయ‌న దుస్తులు మొత్తం ఊడ‌దీసి చిత‌క్కొట్టార‌ని వివ‌రించింది. ఆ దెబ్బలు తాళలేకే ఓంపురి చనిపోయారంటూ పిచ్చి కథనం ప్రసారం చేసింది. పాకిస్థాన్ న‌టుడు ఫ‌వాద్‌ఖాన్‌, బాలీవుడ్ ప్ర‌ముఖ న‌టుడు స‌ల్మాన్‌ఖాన్ కూడా మోదీ జాబితాలో ఉన్నారని, ముస్లింలు కావ‌డ‌మే ఇందుకు కార‌ణ‌మ‌ంటూ చివర్లో మరో కామెంట్ చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Actor Om Puri  Death  Pakistan Media  Bol TV  Aisay Nahin Chalega  Modi Murder  

Other Articles