హర్ట్ ఎటాక్ తో వెటరన్ యాక్టర్ ఓంపురి కన్నుమూత | Om Puri passes away after a massive heart attack.

Veteran actor om puri passes away at 66

Veteran Actor Om Puri, Om Puri Death, Om Puri, Om Puri passes away, Om Puri news, Om Puri movies, Om Puri telugu movies, Om Puri life, Om Puri died, Bollywood Actor Om Puri

Veteran Actor Om Puri Passes Away at the Age of 66 with massive heart attack.

బాలీవుడ్ సీనియర్ నటుడు కన్నుమూత

Posted: 01/06/2017 09:43 AM IST
Veteran actor om puri passes away at 66

బాలీవుడ్ వెటరన్ యాక్టర్ ఓం పురి(66) ఇక లేడు. తీవ్ర గుండెపోటుతో శుక్రవారం ఉదయం ఆయన కన్నుమూశాడు. 1950 అక్టోబర్ 18న హర్యానాలోని అంబాలాలో జన్మించిన ఓంపురి. 1976లో మరాఠీ చిత్రం ఘాసీరామ్ కోత్వాల్ తో సినీ రంగ ప్రవేశం చేశాడు. భారతీయ, పాకిస్థాన్, హాలీవుడ్ సినిమాలతోపాటు పలు ఆర్ట్ చిత్రాల్లో ఆయన నటించాడు.

నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా లో శిక్షణ పొందిన ఆయన వైవిధ్యభరితమైన పాత్రలతో అలరించాడు. మొత్తం 200లకు పైగా చిత్రాల్లో ఆయన నటించాడు. కేంద్ర ప్రభుత్వం ఆయన్ని పద్మశ్రీ అవార్డుతో గౌరవించింది. 1993 లో నందితా పూరీని వివాహం చేసుకోగా ఆమె 2013లో మరణించారు. వీరికి ఇషాన్ పూరీ అనే కూతురు ఉంది.

తెలుగులో కూడా అంకురం, రాత్రి సినిమాల్లో ఆయన నటించారు. సర్జికల్ స్ట్రైక్స్ సమయంలో ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం రేపటం, ఆపై క్షమాపణలు చెప్పి కొంత కాలం అజ్నాతంలోకి వెళ్లిపోయారు. ఫిల్మ్ ఫేర్ రెండుసార్లు బెస్ట్ యాక్టర్, ఒకసారి సపోర్టింగ్ యాక్టర్ అవార్డుతోపాటు, 2009లో ఫిల్మ్ ఫేర్ లైఫ్ టైం అఛీవ్ మెంట్ అవార్డు ను అందుకున్నాడు. ఆయన మృతికి తెలుగు విశేష్ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bollywood  Veteran actor  Om Puri  Heart Attack  Died  

Other Articles