బిర్యానీని బ్యాన్ చేయాలంటున్న స్టార్ హీరో | Kamal Haasan strongly reiterates his opinion on Jallikattu.

Kamal haasan backs jallikattu

Kamal Hassan, Jallikattu, Kamal Jallikattu, Kamal Hassan Biryani Ban, Star Hero on Jallikattu, Jallikattu ban, Kollywood supports Jallikattu, Jallikattu Ban, Kamal Hassan Favorite sport, Kamal Hassan on Jallikattu, India Today Conclave 2017, Kamal Hassan at India Today Conclave, Kamal Hassan Controversy, Jallikattu Controversy

Kamal Hassan says to Government If you want to ban jallikattu, ban biryani too.

వివాదాస్పద అంశంపై కమల్ ఏమంటున్నాడు?

Posted: 01/09/2017 03:53 PM IST
Kamal haasan backs jallikattu

తమిళనాటు ఇప్పుడు సాంప్రదాయ క్రీడ జల్లికట్టుపై తీవ్ర వివాదం నడుస్తోంది. సుప్రీంకోర్టు ఆదేశాలనుసారం నిషేధం విధించాల్సిందేనని కేంద్రం చూస్తుంటే, అక్కడ మాత్రం తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ఈ నేపథ్యంలో కమల్ స్పందించాడు.

సంప్రదాయంగా కొనసాగుతూ వస్తున్న ఈ ఆటను నిషేధించటం సరికాదన్న అభిప్రాయాన్ని లోకనాయకుడు వ్యక్తం చేశాడు. చెన్నైలో జరుగుతున్న సౌత్ క్లోన్ క్లేవ్ కు హాజరరైన కమల్ ఒకవేళ జల్లికట్టుపై నిషేధం విధిస్తే.. అదే సమయంలో బిర్యానీ పై కూడా బ్యాన్ వేయాలని అంటున్నాడు. జల్లికట్టుకు తాను వీరాభిమానినని తెలిపిన కమల్ తాను చాలాసార్లు ఆ క్రీడలో పాల్గొన్నట్లు తెలిపాడు.

స్పెయిన్ లో జరిగే బుల్ ఫైట్ కు, తమిళనాడులోని జల్లికట్టుకు ఎంతో తేడా ఉందని చెప్పారు. బుల్ ఫైట్ లో ఎద్దులు హింసకు గురవుతాయని... ఒక్కోసారి చనిపోతాయని తెలిపారు. కానీ, జల్లికట్టులో ఎలాంటి హింస ఉండదని... తమిళనాడులో ఎద్దులను దేవుడిలా పూజిస్తారని చెప్పారు. ఈ ఆట ఎద్దులను హింసించేది అని ఫీలవుతున్న జంతు ప్రేమికులకు, బిర్యానీ కోసం మూగజీవాలను చంపడం పాపంగా కనిపించటం లేదా? అని ప్రశ్నించాడు. కాగా, 62 ఏళ్ల కమల్ తోపాటు పలువురు కోలీవుడ్ నటీనటులు జల్లికట్టుకు ఇప్పటికే మద్ధతు ప్రకటించారు కూడా.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kamal Hassan  Jallikattu Ban  

Other Articles