థియేటర్ల వివాదం: మూర్తికే రామోజీరావు సపోర్ట్.. | ramojirao helps to Narayanamurthy movie release

Ramojirao helps to narayanamurthy movie release

Ramojirao, R. Narayana Murthy, Constable Venkatramaiah movie, Ramojirao Narayana Murthy, Narayana Murthy ramoji rao, Mayuri film distributors Constable Venkatramaiah, 100 theaters for Constable Venkatramaiah movie

Ramojirao bless R. Narayana Murthy's Constable Venkatramaiah movie, and helps through his Mayuri film distributors.

మూర్తిగారి సినిమాకు అనుకోని మద్ధతు

Posted: 01/09/2017 01:38 PM IST
Ramojirao helps to narayanamurthy movie release

ఇద్దరు అగ్ర హీరోల మైలురాయి చిత్రాలు, ఇంకో యంగ్ హీరో ఫ్యామిలీ ఎంటర్ టైనర్ సినిమా... బరిలో నిలుస్తాయని తెలిసి కూడా తన సినిమాను రిలీజ్ చేసేందుకు సిద్ధమయ్యాడు రెబల్ యాక్టర్ ఆర్. నారాయణమూర్తి. అయితే ఈ క్రమంలో తన సినిమాకు థియేటర్లే దొరకటం లేదంటూ గగ్గోలు పెట్టాడాయన.

దీంతో వివాదం పెద్ది కాకముందే రంగంలోకి దిగారు సినీ పెద్దలు. ప్రస్తుతం ఆయన సినిమాకు వంద థియేటర్ల దాకా దొరికినట్లు సమాచారం. ఇంతకీ ఈ విషయంలో మూర్తిగారికి సహకరించింది ఎవరో కాదు మీడియా మొఘల్ రామోజీ రావు. కానిస్టేబుల్ వెంకట్రామయ్య సినిమాకు సింగిల్ స్క్రీన్ కూడా దొరకలేదన్న వార్త మీడియా ద్వారా తెలుసుకున్న ఆయన తన మయూరి ఫిల్మ్ డిస్ట్రిబ్యూటింగ్ ద్వారా ఈ సాయం చేసినట్లు తెలుస్తోంది.

కమ్యూనిస్ట్ భావజాలాలే తనని, నారాయణమూర్తిని దగ్గర చేశాయని రామోజీరావు స్వయంగా ఈ చిత్ర ఓపెనింగ్ రోజే చెప్పిన తెలిసిందే. అంతేకాదు గతంలో కూడా మూర్తి చాలా సినిమాలు రిలీజ్ ఇబ్బందులను తొలగించి సహకరించాడంట కూడా. అందుకే ఖైదీ, శాతకర్ణి, శతమానం లాంటి చిత్రాలు ఉన్నా సరే తన పరపతితో ఇంత స్థాయిలో థియేటర్లు కట్టబెట్టారంట. జనవరి 14న సంక్రాంతికి కానిస్టేబుల్ వెంకట్రామయ్య రిలీజ్ కానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Constable Venkatramaiah  Theaters  Ramojirao  help  Narayana Murthy  

Other Articles