బాహుబలి-రాయిస్ లింకు తెగొట్టేశారు | No baahubali-2 teaser in Raees movie.

Baahubali team clarification on second part teaser

Baahubali-The Conclusion, Raees, Baahubali-2 teaser, Baahubali Raees, Baahubali-2 Saha Rukh Khan, Baahubali-The Conclusion teaser, Rajamouli on Baahubali-2 teaser, Baahubali-2 official teaser, Baahubali-2

Baahubali-The Conclusion teaser will not release with Shah Rukh Khan’s Raees.

బాహుబలి టీజర్ అప్పుడే ఉంటుంది

Posted: 01/09/2017 11:44 AM IST
Baahubali team clarification on second part teaser

భారీ అంచనాలు... అందుకు తగ్గట్లే రాజమౌళి బాహుబలి-2 ను చెక్కుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ ముగిసిపోగా, మిగతా వర్క్ ను త్వరగతిన పూర్తి చేసి అనుకున్న టైంకి రిలీజ్ చేయాలని ఫ్లాన్ లో ఉన్నాడు. అయితే ఫస్ట్ పార్ట్ విషయంలో మెయింటెన్ చేసిన సస్పెన్స్ ను, ప్రమోషన్ ను ఎందుకో జక్కన్న కంటిన్యూ చేయలేకపోతున్నాడు. బిగినింగ్ విషయంలో పోస్టర్లు, ఫస్ట్ లుక్, టీజర్లు అంటూ హడావుడి చేసి, కంక్లూజన్ కి వచ్చేసరికి ఎలాంటి అప్ డేట్స్ ఇవ్వకుండా నిరాశపరుస్తున్నాడు.

అల్రెడీ విడుదల చేసిన ప్రభాస్, రానా ఫస్ట్ లుక్ లపై అభిమానులంతా పెదవి విరవటం తెలిసిందే. ఏదో కామిక్ పోస్టర్లలా ఉన్నాయంటూ బహిరంగంగానే కామెంట్లు చేశారు కొందరు క్రిటిక్స్. అయితే రిలీజ్ దగ్గర పడే సమయంలోనే అసలు సత్తా చూపిస్తామని రాజన్న క్లారిటీగా చెప్పేశాడు. ఇక ఇంతకు ముందు జనవరిలో సినిమా టీజర్ ను విడుదల చేస్తామని ప్రకటించింది యూనిట్. దాని ప్రకారం ఈ నెల 25న విడుదలయ్యే షారూఖ్ రాయిస్ చిత్రంలో దీనిని ప్రదర్శిస్తారని ప్రచారం జరిగింది.

దీనిపై బాహుబలి టీం అఫీషియల్ గానే స్పందించింది. అదంతా పుకారేనని తేల్చింది. అఫీషియల్ గా తామే అనౌన్స్ చేస్తామని చెప్పింది కూడా. మరోవైపు ఈ రోజు చెన్నైలో ఓ ప్రముఖ మీడియా నిర్వహించబోయే సదస్సుకు చిత్ర యూనిట్ హాజరుకానుంది. ప్యానెల్ లో దర్శకుడు రాజమౌళి, నిర్మాతలు, ఆర్ట్ డైరక్టర్ శిబు సరెల్, సెంథిల్ లాంటి టెక్నిషియన్లు ఉండటం విశేషం. ఏప్రిల్ 28న బాహుబలి-2 ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున్న రిలీజ్ కానుంది.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Baahubali-2  teaser  SRK  Raees  

Other Articles

Today on Telugu Wishesh