నమితను ఓనర్ అలా వాడుకుని.. ఇప్పుడు వేధిస్తున్నాడంట | House owner harassed Actres Namita.

Actor namitha gets reprieve from court

Actres Namita, Namita harassment, Namitha House, Actress Namita owner, House Owner harassment Actress, Namita new house, Namita Nungambakkam, Namita Chennai Court

Big relief to Actress Namita. Chennai court directs house owner not to harass her. and also granted an ad-interim injunction restraining a house owner from evicting from her rented flat in Nungambakkam.

నటి నమితకు హౌజ్ ఓనర్ నుంచి వేధింపులు

Posted: 01/05/2017 10:33 AM IST
Actor namitha gets reprieve from court

నమిత దక్షిణాది సినీ అభిమానులకు పరిచయం అక్కర్లేని పేరు. వెంకటేష్ జెమినీ, సొంతం సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన ఈ హీరోయిన్ ఆ తర్వాత కోలీవుడ్ కు చెక్కేసింది. అక్కడ తన భారీ అందాలతో అశేష అభిమానులను సంపాదించుకుని ఆరాధ్య నటిగా మారిపోయింది. అంతేకాదు ఆపై సినిమా అవకాశాలు క్రమంగా తగ్గిపోవటంతో ఏకంగా రాజకీయ ఆరంగ్రేటం చేసి షాక్ ఇచ్చింది కూడా. ప్రస్తుతం ఆమె ప్రభుత్వంలో ఉన్న అన్నాడీఎంకే అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తోంది.

అయితే గత కొంత కాలంగా ఆమె నివసిస్తున్న ఇంటి యజమాని నుంచి వేధింపులు ఎదుర్కొంటోందంట. ఈ విషయమై కోర్టును ఆశ్రయించగా, ఆమెకు అనుకూలంగా తీర్పు దక్కింది. నుంగంబాకంలోని వీరభద్రమ్ వీధిలో ఓ అపార్ట్ మెంట్ లోని గ్రౌండ్ ఫ్లోర్ లో అద్దెకుంటుంది నమిత. అందుకు ప్రతీ నెలా 15 వేల రూపాయలు చెల్లిస్తోంది కూడా. అయితే తనను ఇల్లు ఖాళీ చేయాలని అతను ఒత్తిడి తెస్తున్నాడని ఆమె కోర్టును ఆశ్రయించారు. డిసెంబర్ 31 నాటికి ఇంటిని ఖాళీ చేయాలని వేధించాడని అసిస్టెంట్ సిటీ సివిల్ కోర్టులో వేసిన పిటిషన్ లో ఆమె ఆరోపించారు.

అంతేకాదు ఓనర్ కరుపయ్యకు సంబంధించి అనేక ఈవెంట్లకు తాను ఫ్రీగా హాజరయ్యాయని, ఆ కృతజ్నత లేకుండా తనను ఇలా ఇబ్బందికి గురి చేయటం సరికాదని ఆమె తరపు న్యాయవాది వాదన వినిపించాడు. కేసును విచారించిన న్యాయమూర్తి జీ శాంతి, ఇరు పక్షాల వాదనలు విని, ఈ నెల 12 వరకూ అదే ఇంట్లో ఉండేందుకు నమితకు అనుమతి ఇస్తూ, మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ఈలోగా మరో ఇల్లు చూసుకుని ఖాళీ చేయాలని ఆదేశించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Actress Namita  House Owner  Harassment  Chennai Court  relief  

Other Articles

Today on Telugu Wishesh