మెగా శాతకర్ణి ట్వీట్ ను వాళ్లు పట్టించుకుంటారా? | Krish's Tweet Puts an End to Rumors.

Krish tweet on khaidi and gsp release dates

Director Krish, Satakarni and Khaidi No 150 fight, Director Krish tweet, Krish clarity on Satakarni release date, Chiru hording at Balayya house, GSP release date, Mega and Nandamuri fans war

Director Krish Jagarlamudi tweet on Gautamiputra Satakarni and Khaidi No 150 release dates.

ఇద్దరు లెజెండ్స్ వచ్చేస్తున్నారు-క్రిష్

Posted: 01/04/2017 12:31 PM IST
Krish tweet on khaidi and gsp release dates

ఇద్దరు స్టార్ హీరోలు. ఇద్దరికీ కీలకమైన సినిమాలే. పైగా భారీ బడ్జెట్. అదే స్థాయిలో చేసిన ప్రీ రిలీజ్ బిజినెస్. ఒకే సమయంలో రిలీజ్ అవుతున్నాయి. వాళ్ల మధ్య పోటీ కన్నా అభిమానుల మధ్య మాటల యుద్ధమే మొదలైపోయింది. మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నంబర్ 150, బాలయ్య వందో చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి బ్యాక్ టూ బ్యాక్ రిలీజ్ కు రెడీ అయ్యాయి. పైగా 16వసారి సంక్రాంతి బరిలో వీరు దిగబోతున్నారు.

అందుకే గత కొంతకాలంగా సోషల్ మీడియా వేదిక గా మెగా వర్సెస్ నందమూరి వార్ నడుస్తోంది. చిత్ర విడుదల విషయంలో క్లారిటీ ఇవ్వకపోవటంతో కాస్త శాంతించినప్పటికీ, తేదీలు ఖరారయ్యాక అది ముదిరింది. ఇక శాతకర్ణి ఆడియో వేడుకలో క్రిష్ ఖబడ్దార్, బన్నీ సంక్రాంతికి మనదే వ్యాఖ్యలతో కత్తులు దూసుకున్నంత పని చేశారు. అయితే ఆపై క్రిష్ తాను మెగా ఫ్యామిలీకి ఫ్యాన్ నని, తన వ్యాఖ్యలను తప్పుగా చేసి గొడవ చేయొద్దంటూ తెలిపాడు.

Khaidi No 150 poster at Balayya's House

ఇదిలా ఉండగానే మెగా ఈవెంట్ కు పర్మిషన్ ఇవ్వకపోవటం, బాలయ్య ఇంటి ఎదురుగా ఖైదీ సీరియస్ పోస్టర్ కాకతాళీయంగా వెలియటం ఆ విమర్శలకు మరింత ఊపు తెచ్చింది. ఈ నేపథ్యంలో క్రిష్ చేసిన ఓ ట్వీట్ సర్వత్రా ఆసక్తికరంగా మారింది. ''ఈ సంక్రాంతికి తమ ల్యాండ్ మార్క్ ఫిలింస్ తో ఎంటర్టయిన్ చేయడానికి ఇద్దరు లెజెండ్స్ వస్తున్నారు. #Jan11Khaidi #Jan12GPSK ట్రెండింగ్ చేసి.. వారికి స్వాగతం పలుకుదాం'' అంటూ ట్వీటేశాడు దర్శకుడు క్రిష్.

నిన్న రామ్ చరణ్ అఫీషియల్ గా జనవరి 11న ఖైదీ నెం 150 సినిమా రిలీజ్ అవుతోందని, 12న బాలయ్య వస్తున్నారు కాబట్టి.. తాము ఒక రోజు ముందు వస్తున్నామని డైరక్ట్ గా ప్రకటించాడు. ఆపై క్రిష్ ఇద్దరికీ స్వాగతం అంటూ పోస్ట్ పెట్టాడు. ఈ రకంగా ఇద్దరు అగ్రహీరోల అభిమానుల మధ్య నెలకొన్న వాదులాటకు ఈ సందేశాలు ఫుల్ స్టాప్ పెడతాయేమో చూడాలి.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Director Krish  Gautamiputra Satakarni  Khaidi No 150  

Other Articles