బుడ్డొడి ఆశలపై నీళ్లు చల్లిన అతిలోక సుందరి | Sridevi Not Coming for NTR-Bobby movie.

Sridevi not part of ntr upcoming movie

Sridevi, Junior NTR, Director Bobby, NTR-Bobby Movie, Sridevi Jr Ntr, Junior NTR Sridevi, Sridevi not aunt for NTR, NTR 27th movie, Bobby NTR Sridevi, Sridevi not NTR Aunt

Makers clarify that Senior actress Sridevi not doing Aunt role in NTR-Bobby movie.

ఎన్టీఆర్ సినిమాకి నో చెప్పిందా?

Posted: 01/04/2017 11:22 AM IST
Sridevi not part of ntr upcoming movie

కీలక పాత్రల్లో సీనియర్ నటులను మెరిపించటం ద్వారా కథకు బలమే కాదు, సినిమాకు స్పెషల్ అట్రాక్షన్ తెచ్చేస్తున్నారు మన దర్శకులు. రమ్యకృష్ణ, కుష్బూ, నదియా లాంటి అప్పటి అందాల తారలను తిరిగి తెలుగు తెరపైకి తేవటం, సెకండ్ ఇన్నింగ్స్ లోనూ వాళ్లు సక్సెస్ ట్రాక్ లో దూసుకుపోవటం చూస్తున్నాం. సరిగ్గా ఆ కోవలోనే అలనాటి అతిలోక సుందరి శ్రీదేవిని తిరిగి తెలుగులోకి తెస్తున్నారంటూ ఓ వార్త బయటికి వచ్చింది.

ఎన్టీఆర్ త్వరలో బాబీతో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో శ్రీదేవితో ఓ పవర్ పుల్ రోల్ చేయించాలని దర్శకుడు యత్నిస్తున్నాడంటూ వార్తలు వచ్చాయి. శ్రీదేవి తన ఫేవరెట్ నటి అని, ఆమెతో చేయటం తన కల అని ఇప్పటికే చాలా సార్లు తారక్ ప్రకటించటం కూడా చూశాం. అయితే కొత్త సినిమా కోసం శ్రీదేవిని తీసుకోబోతున్నారన్న వార్త వైరల్ కాగానే అభిమానులు హుషారెత్తి పోయారు.

కానీ, చిత్ర యూనిట్ ఆ ఆశలపై నీళ్లు చల్లేసింది. ఎన్టీఆర్ 27వ చిత్రంగా తెరకెక్కబోతున్న సినిమాలో శ్రీదేవి లేదంటూ, అందంతా పుకారు అని తేల్చేసింది. అయితే అసలు సంప్రదించారా? సంప్రదిస్తే ఆమె ఒప్పుకోలేదా? అన్న విషయాలపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. ఆ సంగతి పక్కనబెడితే ఎన్టీఆర్ సోదరుడు కళ్యాణ్ రామ్ ఈ సినిమాకు నిర్మాతగా వ్వవహరించబోతున్నాడు. ఈ సినిమాలో ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం పోషించబోతున్నాడని తెలుస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sridevi  Rumour  Junior NTR  Aunt role  27th Movie  Bobby  

Other Articles

Today on Telugu Wishesh