2017 ఫస్ట్ బోణీ.. విడాకులకు రెడీ అయిన హీరోయిన్ | Nandita Das splits with husband after 7 years of marriage.

Nandita das shocks with news of divorce from subodh maskara

Nandita Das, Subodh Maskara, Nandita divorce, Nandita Das splits with husband, Fire actress divorce, Nandita Das kids, Nandita Das first husband, Actress Nandita Das, 2017 bollywood first divorce, Nandita Das and Subodh Maskara

Nandita Das splits with husband Subodh Maskara after 7 years of marriage.

విడాకులు తీసుకోబోతున్న ఉత్తమ నటి

Posted: 01/02/2017 05:11 PM IST
Nandita das shocks with news of divorce from subodh maskara

బాలీవుడ్ కు 2016 విడాకుల నామ సంవత్సరం'గా పేరుపడిపోయింది. పెద్ద చిన్నా స్టార్లు తమ వివాహ వేడుకకు ముగింపు పలికేశారు. ఇక 2017 ఇలా మొదలైందో లేదో అప్పుడు మరో జంట విడాకులకు సిద్ధమైపోయింది. ఆర్ట్ చిత్రాలతో నటిగా గుర్తింపు తెచ్చుకున్న నటి నందితా దాస్ విడాకులు తీసుకోబుతున్నట్లు ప్రకటించింది.

పెళ్లయిన ఏడేళ్లకు తన భర్తతో విడాకులు కోరుతూ ఆమె ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించింది. నటిగానే కాదు దర్శకురాలిగా కూడా నందితాదాస్ (47) తన ఏడేళ్ల వైవాహిక జీవితానికి ముగింపు పలుకుతున్నట్టు ప్రకటించింది.తన భర్త శుభోద్ మస్కారాతో విడిపోతున్నానని వెల్లడించింది. పిల్లలున్నప్పుడు విడిపోవడం కష్టంగానే ఉంటుందని... కానీ, మా కుమారుడికి ఎలాంటి లోటు లేకుండా చూడాలని నిర్ణయించుకున్నామని చెప్పింది. ఇలాంటి సమయంలో తమ ప్రైవసీకి భంగం కలిగించవద్దని మీడియాను కోరింది.

Nandita Das divorce

2002లో సౌమ్య సేన్ అనే వ్యక్తిని పెళ్లాడిన నందితా దాస్, 2007లో అతని నుంచి విడాకులు తీసుకుంది. ఆ తర్వాత ఏడేళ్ల క్రితం నటుడు శుభోద్ మస్కారాను పెళ్లాడింది. వీరిద్దరికీ విహాన్ అనే కుమారుడు ఉన్నాడు. 1989లో పరిణతి సినిమా ద్వారా కెరీర్ ను ప్రారంభించిన సేన్ ఫైర్ లాంటి వివాదాస్పద చిత్రంతోపాటు పాతిక చిత్రాల దాకా నటించింది. తెలుగులో కూడా 2006లో వచ్చిన కమ్లిలో నటించడమే కాదు, ఆ చిత్రానికి ఉత్తమ నటిగా నంది అవార్డును కూడా అందుకుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bollywood Actress  nandita Das  Divorce  Subodh Maskara  

Other Articles