తెలుగు సినిమాలపై సీనియర్ నటి ఫైర్.. రేప్ సీన్లు చూపించాలా? | Jamuna fire on tollywood movie culture.

Actress jamuna comments on tollywood

Actress Jamuna, Jamuna on tollywood movies, Jamuna shocking comments, Senior Actress, Jamuna on rape scenes, Tollywood Actress Jamuna, Jamuna fire on telugu movies

Senior actress Jamuna shocking comments on Tollywood.

అర్థం పర్థం లేని సినిమాలు వస్తున్నాయి: జమున

Posted: 01/03/2017 09:37 AM IST
Actress jamuna comments on tollywood

పరభాష నటులపై వ్యామోహం, తమకు అవకాశాలు ఇచ్చి ప్రోత్సహించకపోవటం, ఇప్పుడున్న యంగ్ హీరోలు కాస్త కూడా గౌరవం ఇవ్వకపోవటం... ఇవి ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమకు చెందిన సీనియర్లు ఇస్తున్న కంప్లైంట్. విలన్ ట్రెండ్ సెట్టర్ కోటశ్రీనివాస రావు దగ్గరి నుంచి అన్నపూర్ణమ్మ, చంద్రమోహన్ ఇలా ప్రతీ ఒక్కరూ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల గురించి పెదవి విరుస్తున్న వారే. రాళ్లపల్లి లాంటి వాళ్లైతే సినిమాలను సైతం వద్దనుకునే స్థాయికి చేరిపోయారు.

అయితే సీనియర్ నటి జమున కూడా ఇప్పుడు ఈ జాబితాలో చేరిపోయింది. ఇప్పుడు తెలుగు సినిమాల్లో వస్తున్న మార్పులు జీర్ణించుకోగలిగేలా లేవని చెబుతున్నారు. అప్పట్లో భక్తపోతన మూవీ చూసి బాలయోగి వస్తే.. ఇప్పుడు సినిమాలు చూసి యువత రోడ్ సైడ్ రోమియోలుగా తయారవుతున్నారు. అనేక సన్నివేశాలు.. సినిమాలు.. పాత్రలు నాలాంటి సీనియర్ నటులు తలదించుకునేలా ఉంటున్నాయి.' అంటూ తన నిరుత్సాహం వెల్లడించింది.

ఓ పంక్షన్ లో ఎన్టీఆర్ అవార్డు అందుకున్న ఆమె తెలుగు సినిమాల్లో వస్తున్న మార్పులు సమాజానికి ఏ మాత్రం మంచివి కావంటూ వ్యాఖ్యానించింది. అప్పట్లో మంచిని చెప్పే సినిమాలు వస్తే ఇప్పుడు చెడును చూపించేందుకే ప్రాధాన్యత ఇస్తున్నారు. దీంతో యువతరం చెడు మార్గంలో నడుస్తోంది. సామూహిక అత్యాచారాల్లాంటి కూడా చోటు చేసుకోవడం వంటివి మంచి పరిణామం కాదు అంటున్నారు ఆమె. బాహుబలి గొప్ప సినిమా ఏం కాదని, అంత కంటే మంచి సినిమాలు అప్పట్లోనే వచ్చాయంటూ ఆమె వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Actress Jamuna  Fire  Tollywood Movies  

Other Articles