వంగవీటిపై నో బెదిరింపులు.. పూరీ ఆఫీస్ లో ఉండగానే అంతా జరిగిపోయింది! | actor Sandeep on Vanagaveeti Success.

Actor sandeep about vangaveeti chance

Actor Sandeep, Vangaveeti Hero, Vangaveeti Sandeep, Sandeep vangaveeti, Varma Vangaveeti, Sandeep about Vangaveeti Threat, Sliverscreen Vangaveeti Ranga, Reel Vangaveeti Ranga, Sandeep Puri Jagannath

Actor Sandeep says how he transform into Radha And Ranga for Vangaveeti Movie.

పూరీ ఆఫీస్ లో ఉండగానే అంతా జరిగిపోయింది

Posted: 12/29/2016 12:58 PM IST
Actor sandeep about vangaveeti chance

వంగవీటి రంగకు నెగటివ్ రివ్యూలు వచ్చినప్పటికీ, తర్వాత రంగ ఫ్యామిలీ వర్సెస్ వర్మ విమర్శలతో, రంగా-రాధా అభిమాన సంఘాల బెదిరింపులతో, వీటికి తోడు కొంచెం మౌత్ టాక్ బాగుందనే రావటంతో థియేటర్లలో కాస్త ఆక్యూపెన్సీ పెరిగిందనే తెలుస్తోంది. అయితే అది పూర్తి స్థాయి డ్యామేజ్ ను కంట్రోల్ చేస్తుందా అంటే మాత్రం ఇప్పుడే చెప్పలేని పరిస్థితి. అయినప్పటికీ చిత్ర యూనిట్ మాత్రం తమ వంతు యత్నంగా పోస్ట్ రిలీజ్ ప్రమోషన్ లో మాత్రం పాల్గొంటున్నారు.

ఇక ఇందులో రాధా, రంగ పాత్రలో నటించిన సందీప్ తనకు అసలు ఎలా అవకాశం దక్కిందో వివరించాడు. శాండీ తొలి చిత్రం పూరీ తీసిన జ్యోతిలక్ష్మి, ఆపై లోఫర్ లో కూడా ఓ చిన్నరోల్ చేశాడు. అలా పూరీ ఆఫీస్ దగ్గరే ఎక్కువ సమయం గడిపేవాడంట. ఓ రోజు అక్కడకు వచ్చిన వర్మ అతన్ని చూసి వంగవీటికి సెలక్ట్ చేశాడంట. ముందుగా కేవలం రాధా పాత్రకే ఎంపిక చేసినప్పటికీ, రాధా-రంగలకు దగ్గరి పోలికలు ఉండటంతో ఆ పాత్రను కూడా తనతోనే చేయించాలని వర్మ డిసైడ్ అయ్యాడంట.

ఇక సినిమా కోసం వంగవీటి కథనాలను చదవటంతోపాటు, ఫోటోలు తెప్పించుకోవటం, పలువురి ద్వారా కథలు వినటం తద్వారా వారి బాడీ లాంగ్వేజ్ లోకి మారిపోయానని చెబుతున్నాడు. ఇక స్క్రీన్ పై చూసిన వారంతా ఆ రెండు పాత్రల్లో జీవించేశావంటూ ప్రశంసింస్తున్నారని చెప్పుకొచ్చాడు శాండీ. చిత్రం విడుదల తర్వాత తనకు ఎటువంటి బెదిరింపులు రాలేదంటూ వివరించాడు. అన్నట్లు ఈ యంగ్ నటుడు మెగా ఫ్యామిలీకి వీరాభిమాని అట కూడా.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Actor Sandeep  Vangaveeti Movie  

Other Articles